వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని మోదీని భారతీయ యాసలో అనుకరించినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అఫ్గానిస్తాన్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం మరింత మంతి సైన్యాన్ని, నిధులను పంపేందుకు ముందుకు రావటంపై.. గతేడాది అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘తక్కువ లాభం పొందుతున్నప్పటికీ ప్రతిఫలంగా ఎక్కువ మొత్తాన్ని తిరిగిస్తున్నారు’ అంటూ కొనియాడారు. ప్రపంచమంతా అఫ్గాన్‌ను అమెరికా సొంత అవసరాలకు వాడుకుంటోందని విమర్శిస్తున్న నేపథ్యంలో మోదీ ప్రశంసలకు ట్రంప్ మురిసిపోయారు.
వేరో సందర్భంలో మోదీ వ్యాఖ్యలను భారతీయ యాసలోనే అనుకరించినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. కాగా, ట్రంప్ తీరును భారత–అమెరికన్ డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ కథనంపై శ్వేతసౌధం ఇంతవరకు స్పందించలేదు. వాషింగ్టన్ పోస్టుతోపాటు ఇతర అమెరికా వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు అసత్యమంటూ ట్రంప్ ఇటీవలే ‘ఫేక్‌న్యూస్’ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment