వాషింగ్టన్ పోస్ట్పై కాలుదువ్విన ట్రంప్ | Trump revokes Washington Post's access to his campaign | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్ పోస్ట్పై కాలుదువ్విన ట్రంప్

Published Tue, Jun 14 2016 10:43 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

వాషింగ్టన్ పోస్ట్పై కాలుదువ్విన ట్రంప్ - Sakshi

వాషింగ్టన్ పోస్ట్పై కాలుదువ్విన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో వివాదం పెట్టుకున్నాడు. మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటూ తిరిగి అదే వివాదంలోకి వెళుతున్నారు. మీడియా ప్రతినిధులపై ముందునుంచే కస్సుబుస్సులాడుతున్న ఈ బిజినెస్ టైకూన్ ఈసారి ఏకంగా తన ప్రచార కార్యక్రమం నుంచి ప్రముఖ వార్తా పత్రిక, ఆన్ లైన్ న్యూస్ సంస్థ వాషింగ్టన్ పోస్ట్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు.

తనపై తప్పుడు కథనాలు వెలువరించినందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పాడు. ఓర్లాండోలో కాల్పుల ఘటనపై ఒబామా స్పందిస్తూ దేశీయ ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలానికి గురైన వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, ఈ మాటలను ఉటంకిస్తూ ఒబామాను ట్రంప్ తప్పుబట్టారని, ఓర్లాండో షూటింగ్కు ఒబామాకు సంబంధం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.

రోజంతా ఈ కథనాన్ని తన వెబ్ సైట్ లో పెట్టింది. అంతేకాకుండా, ఇస్లామిక్ ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించడానికి ఒబామా వెనుకాడుతున్నారని, దీనిని బట్టి ఆయనకు ఆ సంస్థకు మధ్య ఏదో జరుగుతుందని ట్రంప్ చెప్పారని ఆ కథనంలో వెలువరించారు. దీంతో మండిపడిన ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్ వి తప్పుడు రాతలని అన్నారు.

అబద్ధాలను ప్రచారం చేస్తుందని, తాను అనని మాటలను కూడా అన్నట్లుగా చెబుతూ అనైతికంగా వ్యవహరిస్తుందని, ఈ నేపథ్యంలో తన ప్రచార కార్యక్రమాల కవరేజీకి రాకుండా ఆ సంస్థ రిపోర్టర్లను నిషేధిస్తున్నట్లు చెప్పారు. కాగా, వాషింగ్టన్ పోస్ట్ అధినేత బారన్ స్పందిస్తూ తమ పేపర్ కచ్చితంగా ట్రంప్ ప్రచారాన్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్లుగా, ఉత్సాహంగా ప్రచురణ చేస్తుందని.. ఎందుకంటే తమ కవరేజ్ స్థాయి అలా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement