
సమ్‌థింగ్ స్పెషల్
కొందరు డైరీలు రాయరు. కొందరు డైరీ రాసే అలవాటును మధ్యలోనే వదిలేస్తారు. అమెరికాకు చెందిన ఎవీ రిస్కీ అలా కాదు. వంద సంవత్సరాల రిస్కీ తొంభై సంవత్సరాలుగా డైరీలు రాస్తూనే ఉంది... ఎవీ రిస్కీ తండ్రికీ డైరీలు రాయడం అంటే ఎంతో ఇష్టం. కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం రోజున డైరీని కానుకగా ఇచ్చాడు.
ఇక అప్పటినుంచి మొదలైన డైరీ రాసే అలవాటు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రతిరోజూ డైరీ రాస్తోంది. ఇది ఆమెకు జీవితకాలపు అలవాటు అయింది. చిన్ననాటి నుంచి మొదలైన ఈ అలవాటు వల్ల ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని కూడా డాక్యుమెంటూ చేస్తూ వస్తోంది.
నయాగరా అనే చిన్న పట్టణంలో పెరిగిన రిస్కీ ప్రతి సీజన్ గురించి రాసింది. కుటుంబ ప్రయాణాల నుంచి చారిత్రాత్మక సంచలన ఘటనల వరకు ఎన్నో చేసింది. కష్టకాలంలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ డైరీ రాయడం ఆపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా డైరీ రాయడం మానలేదు.
ఎప్పుడైనా డైరీని చేరుకోలేనంత అనారోగ్యంగా ఉంటే చిత్తు కాగితాలపై నోట్సు రాసి ఆ తరువాత డైరీలో రాసేది. ప్రతిరాత్రి డైరీ రాయడం పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఆరోజు విషయాలను తెలుసుకోవడం తనకు ఆసక్తిగా ఉంటుంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఎవీ రీస్కీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆన్‌లైన్ సెన్సేషన్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment