పూరి: వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధి నుంచి చిన్న భాషా పత్రికలకు మినహానింపునివ్వాలని ఇండియన్ లాంగ్వేజెస్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్(ఐఎల్‌ఎన్‌ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పూరీలో నిర్వహించిన ఐఎల్‌ఎన్‌ఏ 76వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సభ్యులు తీర్మానం చేశారు. అసంబద్ధ కారణాలు చూపి చిన్నభాషా పత్రికలకు ప్రకటనలు ఇవ్వొద్దని డైరెర్టరేట్ ఆఫ్ అడ్వరై్టజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ప్రతిపాదనలు పంపడం దారుణమన్నారు. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పీసీఐకి ఆ అధికారాలు లేవని స్పష్టంచేశారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖకు సైతం పీసీఐ రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు, ఐఎల్‌ఎన్‌ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కాబోయే అధ్యక్షులుగా పరేశ్‌నాథ్‌ను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment