సాక్షి, అమరావతి: విశ్వసనీయ సమాచారం అందించడంలో పత్రికలు మరోసారి పాఠకుల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కంటే ప్రస్తుతం పాఠకులు పత్రికలను ఎక్కువగా చదువుతున్నారని ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ అవాన్స్ ఫీల్డ్ అండ్ బ్రాండ్ సొల్యూషన్స్ సర్వేలో వెల్లడైంది. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో అసత్య, నిరాధార వార్తలు విపరీతంగా ప్రచారం చేస్తుండటం గందరగోళానికి దారితీస్తోంది. దాంతో ప్రజలు వాస్తవాల కోసం పత్రికలపైనే ఆధారపడుతున్నారని.. పత్రికలతో పాఠకుల బంధం బలోపేతమవుతోందని ఆ సర్వే స్పష్టం చేసింది.
ఆ సర్వేలో తేలిన కీలక అంశాలివీ
► లాక్‌డౌన్‌కు ముందు సగటు పాఠకుడు పత్రికను రోజుకు 38 నిమిషాల పాటు చదివేవారు. ప్రస్తుతం సగటు పాఠకుడు రోజుకు గంటపాటు చదువుతున్నాడు.
► మొత్తం పాఠకుల్లో లాక్‌డౌన్‌కు ముందు 16 శాతం మంది గంట సమయం కంటే ఎక్కువసేపు పత్రిక చదివేవారు. ప్రస్తుతం 38 శాతం మంది గంట సమయం కంటే ఎక్కువసేపు పత్రిక చదువుతున్నారు.
► ప్రస్తుతం అరగంట కంటే ఎక్కువ సమయం పత్రిక చదువుతున్న పాఠకులు 72 శాతం మంది. లాక్‌డౌన్‌కు ముందు కేవలం ఇది 42 శాతమే.
► ప్రస్తుతం 15 నిమిషాల కంటే తక్కువ సేపు పత్రిక చదువుతున్న పాఠకులు కేవలం 3 శాతమే. లాక్‌డౌన్‌కు ముందు 14 శాతం మంది ఉండేవారు.
► మొత్తం పాఠకుల్లో లాక్‌డౌన్ రోజుల్లో పత్రికను ఒకటి కంటే ఎక్కువసార్లు చదువుతున్నవారు 42 శాతం మంది.
Comments
Please login to add a commentAdd a comment