
కర్ణాటక , యశవంతపుర : పత్రికలు, టీవీలపై తనకు నమ్మకం పోయిందని, దీంతో పదేళ్లుగా తాను టీవీ, పత్రికలను చూడటం లేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మీడియాపై విరుచుకు పడ్డారు. బుధవారం ఆయన కారవార జిల్లా అంకోల తాలూకా అలగెరెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
మీరు ఆరోగ్యంగా ఉండలాంటే టీవీలను చూడటం మానుకోవాలన్నారు. నెల రోజుల క్రితం ఉద్యోగ మేళాలో ఆపరేషన్ కమలం స్పందించాలని కోరిన విలేకర్లను కేంద్రమంత్రి తన రక్షణ సిబ్బందితో నెట్టివేయించారు. దీంతో మీడియా కేంద్రమంత్రి సమావేశాన్ని అప్పట్లో బహిష్కరించింది. దీంతో అప్పటి నుంచి ఆయన మీడియాపై అక్కసు పెంచుకున్నారు. వారం రోజుల క్రితం అంకోలలో పాస్‌పోర్ట్ ఆఫీసు ప్రారంభోత్సవానికి రాగా మీడియా ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయన మీడియాపై కోపం పెంచుకుని ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment