
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు
బొబ్బిలి: భార్యతో గొడవ పడిన భర్త ఇంటికి నిప్పంటించిన సంఘటన బొబ్బిలిలోని ఇందిరమ్మకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాలనీలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సురేష్, తన భార్య స్వాతితో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు.
దీంతో ఇంటితో పాటు సామాన్లు కాలిబూడిదయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఇంటిలోని సామన్లు కాలిపోవడంతో బాధితురాలు స్వాతి లబోదిబోమంటోంది.
Comments
Please login to add a commentAdd a comment