పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో అగ్నిప్రమాదం సంభవించింది
వేలేరుపాడు: పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 70 పూరిళ్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఓ ఇంట్లో సిలిండర్ పేలిన కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.