ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి | Huge Fire Broke Out Childrens Hospital In Pakistan | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి

Published Sat, Jun 4 2022 2:05 PM | Last Updated on Sat, Jun 4 2022 2:13 PM

Huge Fire Broke Out Childrens Hospital In Pakistan - Sakshi

ఇస్తామాబాద్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్‌లోని ది చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు.  40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. 

(చదవండి: పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన అత్యంత వృద్ధుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement