ఇస‍్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంచూరిస్ మాల్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగి 20వ అంతస్తు వరకు వ్యాపించాయి. మంటలు వేగంగా మొదటి ఫ్లోర్‌కు సైతం వ్యాపించాయి. పై అతస్తుల్లో నివాస సమూదాయాలు ఉండటం వల్ల భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ మీడియాలు పేర్కొన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. సెంచూరియస్ మాల్‌లో మొత్తం 26 అంతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రెస్క్యూ బృందాలు రావటంలో జాప్యం కారణంగా మంటలు పై అంతస్తులకు వ్యాపించినట్లు స్థానిక మీడియాలు ఆరోపించాయి. మొనాల్ రెస్టారెంట్‌లో ముందుగా మంటలు చెలరేగాయని, ప్రమాదంలో రెస్టారెంట్ మొత్తం కాలి బూడిదైనట్లు పేర్కొన్నాయి.
Fire in Centaurus Mall is getting stronger#Centaurus #Islamabad pic.twitter.com/Duo32Bjcmz
— Shehzad Gul Hassan (@ShehzadGul89) October 9, 2022
Islamabad’s upscale Centaurus Mall under a massive fire right now pic.twitter.com/vuHfvGiuGc
— omar r quraishi (@omar_quraishi) October 9, 2022
ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment