huge fire accident
-
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. ఆసుపత్రిలో చెలరేగిన మంటలు
సాక్షి, విశాఖపట్నం: జగదాంబ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ రవి శంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఇదీ చదవండి: షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం! -
షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.8 నుంచి 10 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మొదటి, రెండవ అంతస్తులో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఇదీ చదవండి: ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం? -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
భారీ అగ్ని ప్రమాదం.. 20 అంతస్తుల్లో చెలరేగిన మంటలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంచూరిస్ మాల్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగి 20వ అంతస్తు వరకు వ్యాపించాయి. మంటలు వేగంగా మొదటి ఫ్లోర్‌కు సైతం వ్యాపించాయి. పై అతస్తుల్లో నివాస సమూదాయాలు ఉండటం వల్ల భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ మీడియాలు పేర్కొన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. సెంచూరియస్ మాల్లో మొత్తం 26 అంతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రెస్క్యూ బృందాలు రావటంలో జాప్యం కారణంగా మంటలు పై అంతస్తులకు వ్యాపించినట్లు స్థానిక మీడియాలు ఆరోపించాయి. మొనాల్ రెస్టారెంట్లో ముందుగా మంటలు చెలరేగాయని, ప్రమాదంలో రెస్టారెంట్ మొత్తం కాలి బూడిదైనట్లు పేర్కొన్నాయి. Fire in Centaurus Mall is getting stronger#Centaurus #Islamabad pic.twitter.com/Duo32Bjcmz — Shehzad Gul Hassan (@ShehzadGul89) October 9, 2022 Islamabad’s upscale Centaurus Mall under a massive fire right now pic.twitter.com/vuHfvGiuGc — omar r quraishi (@omar_quraishi) October 9, 2022 ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలోని ఈశాన్య నగరం చాంగ్‌చున్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి భోజనం చేసేందుకు వెళ్లిన వారితో పాటు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. రెస్టారెంట్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణాలతో చైనాలో తరుచుగా ఘోర అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చైనా టెలికాం కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది. గత ఏడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, రేణిగుంట: తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని ఓ ప్రైవేటు క్లినిక్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్‌లో మొత్తం 5 మంది ఉన్నారు. ఆసుపత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసముంటోంది. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఇద్దరు చిన్నారులు సిద్దార్థరెడ్డి, కార్తిక సహా డాక్టర్ రవిశంకర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ భార్య, తల్లిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుగా ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించగా.. క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశంకర్ భవనంలోనే చిక్కుకుపోయారు. రవిశంకర్‌ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ రవిశంకర్‌తో పాటు.. ఆయన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ రెడ్డి, కార్తికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. -
టింబర్ డిపోలో ఎగిసిపడ్డ మంటలు
-
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
ముంబైతీరంలో భారీ అగ్ని ప్రమాదం
-
విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం
-
కృష్ణాజిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
-
కృష్ణాజిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
కంకిపాడు : కృష్ణాజిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కంకిపాడు మండలం మంతెన గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై 120 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. నల్లగొండ జిల్లా రామచంద్రపురం నుంచి చెరకు నరికేందుకు నెలరోజుల కిందట 150 కుటుంబాలు మంతెనకు వచ్చాయి. ఇక్కడే చెరకు తోట పక్కన వున్న ఖాళీ స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం కూలీలు పనులకు వెళ్లిన సందర్భంలో ఓ గుడిసెలోని గ్యాస్ సిలెండర్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. మంటలు మిగతా గుడిసెలకు కూడా వ్యాపించడంతో 120 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గుడిసెల్లో ఉన్న తొమ్మిది సిలెండర్లు కూడా పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
ఆల్వాల్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
-
విశాఖలో భారీ అగ్నిప్రమాదం
-
విశాఖలో భారీ అగ్నిప్రమాదం
విశాఖ: విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీతమ్మధారలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తునా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజమండ్రిలో తగలబడ్డ ప్లాస్టిక్ గౌడౌన్
-
గుర్గావ్లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం
గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 25 ఫర్నిచర్, ఆటోమొబైల్ షాపులు దగ్ధమయ్యాయి. దాంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే అంతా కాలి బూడిదైపోయినట్టు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
బల్కంపేట ఎస్బీఐలో అగ్నిప్రమాదం
-
ఫిలిప్పైన్‌లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి
మనిలా: ఫిలిప్పైన్ రాజధాని మనిలాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు. గురువారం శిథిలాల్లో చిక్కుకున్న శవాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కొన్నింటికి పుర్రెలు, ఎముకలు కూడా లభించలేదు. -
ఎఫ్‌సిఐ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం
-
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల సమీపంలో జిన్నింగ్ మిల్లులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొక్కుపాళెంలో భారీ అగ్నిప్రమాదం
చిట్టమూరు, న్యూస్‌లైన్: మల్లాం పంచాయతీలోని కొక్కుపాళెంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు గ్యాస్ సిలిండర్ పేలుడు తోడవడంతో రెండు పూరిళ్లు, రెండు ధాన్యం కూట్లు, నగదు, బంగారు ఆభరణాలు కాలిపోయాయి. గ్రామస్తుల కథనం మేరకు..గ్రామానికి చెందిన లింగారెడ్డి బాలిరెడ్డి ఓ వివాహానికి హాజరయ్యేందుకు నెల్లూరు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. పూరిల్లు కావడంతో వేగంగా వ్యాపిస్తున్న మంటలను చూసి ఆర్పేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, గాలి కూడా వీస్తుండడంతో పక్కనే ఉన్న బాలిరెడ్డికే చెందిన మరో పూరింటికి కూడా మంటలు వ్యాపించాయి. ఆ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ఆ పక్కనే ఉన్న పెళ్లూరు భాస్కర్‌రెడ్డికి చెంది ధాన్యం కూట్లకు కూడా మంటలు అంటుకున్నాయి. దట్టంగా పొగకమ్ముకోవడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం కరువైంది. ఇంతలో కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బాలిరెడ్డి ఇంట్లోని లక్ష రూపాయల నగదు, 30 సవర్ల బంగారు నగలు, గృహోపకరణ వస్తువులు, పెళ్లూరు భాస్కర్‌రెడ్డికి చెందిన సుమారు 500 బస్తాల జిలకర మసూరి ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు బోరుమంటున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాలిరెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారం క్రితమే పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో బంగారు నగలు చేయించుకున్నామని, అవి మంటల్లో కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కాలి బూడిదవడంతో పెళ్లూరు భాస్కర్‌రెడ్డి తీవ్రంగా నష్టపోయారు. -
అగ్నిప్రమాదంలో ఐదుగురు మహిళల సజీవదహనం
-
ధమళేశ్వరంలో ఘోరం.. ఐదుగురు సజీవదహనం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ధమళేశ్వరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు సజీవదహనమైయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీ మంటలతో ఎగసిపడుతూ గుడిసె పైకప్పు నిద్రిస్తున్న వారిపై పడింది. దీంతో ఆ ఐదుగురు మహిళలు బయటికి రాలేక గుడిసెలో అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులలో మరొకరిని అక్కడి స్థానికులు ప్రాణాలతో కాపాడారు. మృతిచెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం
కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్ధానిక దుమ్ములపేటలో జరిగిన ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు వందకు పైగా మత్స్యకారులకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నించినా.. చాల సేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఆ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 500 కుటుంబాలు నిరాశ్రులైయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియవని అగ్నిమాక అధికారుల చెబుతున్నారు. ఘటనా స్ధలానికి జిల్లా కలెక్టరుతో పాటు పలువురు ఉన్నాతాధికారులు చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానికులను విచారిస్తున్నారు. -
కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం