గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల సమీపంలో జిన్నింగ్ మిల్లులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.