
సాక్షి, విశాఖపట్నం: జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు.
పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ రవి శంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.
ఇదీ చదవండి: షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం!
Comments
Please login to add a commentAdd a comment