Children hospital
-
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి
ఇస్తామాబాద్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్‌లోని ది చిల్డ్రన్స్ హాస్పిటల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు. 40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన అత్యంత వృద్ధుడు) -
పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఓ పసికందును చేతిల్లోకి తీసుకుని ఆప్యాయంగా లాలించారు. చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు.. అనంతరం టాటా ట్రస్ట్ సహకారంతో శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సీఎం ప్రారంభించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ అలిపిరి వద్ద 25 ఎకరాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రారంభంతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. -
ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్
న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం వెల్లడించింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
లోకం చూడకముందే కళ్లు మూస్తున్నారు
‘నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. బిడ్డను తీసుకుని ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికిచేరుకున్నారు. అయితే ఉదయం వరకు బిడ్డను ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. రెండు రోజుల క్రితం బండ్లగూడకు చెందిన రాగిణి పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కడుపులో ఉండగా ఉమ్మనీరు తాగడంతో బిడ్డను చికిత్స కోసం నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో శిశువు మృతి చెందింది‘. ఇలా ఒక్క సుజాత, రాగిణిల బిడ్డలే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న అనేక మందికి ఇదే అనుభవం ఎదురవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం..సకాలంలో వైద్యం అందకపోవడంతో అనేక మంది శిశువులు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బాధితులకు చికిత్సలను నిరాకరిస్తుండటంతో వారంతా నిలోఫర్‌ను ఆశ్రయిస్తున్నారు. సీరియస్ కండిషన్లో వస్తున్న రోగుల సంఖ్య ఇటీవల రెట్టింపైంది. ఆస్పత్రిలో వీరికి ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడం, చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతోంది. ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దులోని మహారాష్ట్ర, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుండటం, నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించడం, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడం, అవయవాల నిర్మాణం సరిగా లేకపోవడం, ఉమ్మనీరు మింగడం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. నిజానికి 2014తో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ (ఎమర్జన్సీ వార్డు)వచ్చాక అదనంగా మరో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్, ఎక్సరే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యపోస్టులు కూడా చాలా వరకు భర్తీ అయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపు తర్వాత మరణాల రేటు తగ్గాల్సిందిపోయి...ఏటా మరింత పెరుగుతుండటం తల్లిదం డ్రులకు తీవ్ర ఆందోళన కలి గిస్తుంది. సంరక్షకులే నర్సుల అవతారం.. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో 130 మందే ఉన్నారు. 200 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 75 మంది, జనరల్ వార్డులో ప్రతి ఐదుగురు శిశువులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, యాభై మందికి ఒకరు, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, ఇరువై మందికి ఒక నర్సు మాత్రమే ఉంది. ప్రతి వెంటిలేటరుకు కనీసం నాలుగు రౌండ్లకు కలిపి కనీసం నలుగురు నర్సులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పని చేస్తున్న పదిహేడు వెంటిలేటర్లకు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో సరిపడా నర్సులు లేకపోవడంతో ఆ బాధ్యత కూడా సంరక్షకులే నిర్వహించాల్సి వస్తోంది. వీరంతా కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకుండా పాదరక్షలతోనే వార్డుల్లోకి వెళ్తున్నారు. ఆసుపత్రికి ప్రస్తుతం 289 మంది నర్సుల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం జీవో నెంబరు 88 ప్రకారం ఆ పోస్టులు మంజూరు చేసి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమాకాలు చేపట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులకు తప్పని గుండె కోత.. హృద్రోగ సమస్యలతో నిత్యం 100 మంది వరకు శిశువులు వస్తుంటారు. వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయాలి.ఆస్పత్రిలో ఈ మిషన్లు లేక పోవడంతో రోగులను ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే అక్కడ రోగుల రద్దీ ఎక్కువ ఉండటంతో శిశువుల వైద్యపరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యూరోసర్జరీ, న్యూరోఫిజీషియన్, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా సమస్యలతో బాధపడుతున్న శిశువులను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక టెస్టులన్నీ కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి అమలు కావడం లేదు. ఇన్ వార్డులతో పాటు క్యాజువాలిటీ, సర్జికల్, ప్రసూతి వార్డుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు కన్పించడం లేదు. ఒక వేళ ఉన్నా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్లముందే కన్నబిడ్డ మృవాత పడుతుండటంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో వైద్యులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
షైన్ ఆస్పపత్రి ఘటనలో బైయిల్కు వీలులేని సెక్షన్
-
షైన్ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో.. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీలు చేపట్టి.. ఆస్పత్రి సెల్లార్‌తో సహా నాలుగు అంతస్థులని క్షుణ్ణంగా పరిశీలించారు. షైన్ హాస్పిటల్లో జరిగిన ప్రమాదంపై విచారణను వేగవంతం చేసేందుకు ఇప్పటికే క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు ఇప్పటికే హాస్పిటల్‌కు నోటీసులు జారీ చేశారు. షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రమాదంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చనుంది. అనంతరం ప్రభుత్వానికి తన రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. జంటనగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటన తరువాత గతేడాదితో ఆస్పత్రి పర్మిషన్ ముగిసిందని, ఆస్పత్రిలో ప్రమాదం జరిగినపుడు తక్షణమే పాటించాల్సిన నియంత్రణ వ్యవస్థే లేదని మానవ హక్కుల కమిషన్‌కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. భవనం అక్రమ కట్టడమని, అధికారుల నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఒక చిన్నారి మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలనివారు కోరారు. -
న్యుమోనియాతో వస్తే.. ప్రాణాలు పోయాయి
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని ఐసీయూలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ చిన్నారులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి అగ్ని మాపక అనుమతులు తీసుకోలేదని తమ విచారణలో తేలినట్టు విశ్వజిత్ చెప్పారు. (చదవండి : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు) నగరంలోని అన్ని ఆసుపత్రులకు అగ్నిమాపక అనుమతుల విషయంపై నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అగ్ని మాపక అనుమతులు లేని ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అగ్ని మాపక అనుమతుల విషయంపై విచారిస్తామని అన్నారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, స్కూళ్లకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదం నేపథ్యంలో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, షైన్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ కుమార్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. వైద్యుడు సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం) గతంలో కూడా ఇలాగే జరిగింది.. చికిత్స కోసం వస్తే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని షైన్ హాస్పిటల్లో చనిపోయిన బాలుడి తండ్రి నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘న్యుమోనియాతో బాధపడుతున్న నా కుమారున్ని ఈ నెల 17న షైన్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాను. యాదాద్రి జిల్లా నుంచి వైద్యం కోసం ఇక్కడికి వచ్చాం. గతంలో కూడా ఇదే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్లీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మా బాబు చనిపోయాడు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగి ఇన్ని గంటలు కావొస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదు’అని నరేష్ వాపోయారు. -
నవ్వింత: నాన్నకు డబ్బులు వేస్ట్!
మా పాపకు ఎనిమిదేళ్లు. మేం చెన్నైలో ఉన్నప్పుడు తను ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. ఒకరోజు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, తను నన్ను ఒక డౌట్ అడిగింది- ‘అమ్మా నీకు నాన ఎలా వచ్చాడు’ అని. అప్పుడు నేను, ‘మీ నానని కొనుక్కున్నానమ్మా’ అని చెప్పా. ‘అరె నాన బ్యాడ్ నాన కదా. డబ్బులు వేస్ట్ చేసి ఎందుకు కొనుక్కున్నావ్’ అంది. ‘నా సెలక్షన్ కాదుమా, అమ్మమ్మవాళ్లు తెచ్చిచ్చారు’ అన్నా. ఇంతలో స్నానం చేసి, అప్పుడే మావారు హాల్లోకి వచ్చారు. జరిగింది చెప్పా. వాళ్ల నాన్న కోపంగా చూశారు తన వైపు. వెంటనే తను, ‘నాన నువ్వు వెరీ వెరీ గుడ్ నాన. జోక్‌గా చెప్పాను. నువ్వు మంచి నానవు’ అంటూ వాళ్ల నాన్నని పట్టుకుంది. అది తనలో ఒకవైపే. సెకెండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తనకు బాగా ఫీవర్ వచ్చింది. చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. ఫుల్ రష్‌గా ఉంది. టోకెన్ తీసుకొని తనని కూర్చోబెట్టేందుకు వెయిటింగ్ రూమ్‌కి తీసుకెళ్లా. అక్కడ ఒక సీట్ మాత్రమే ఉంది. కూర్చోమ్మా అన్నా. కానీ తను కూర్చోలేదు. ‘ఫరవాలేదుమా, నేను నిలబడే ఉంటా. నువ్వు కూర్చో’ అంది. తను వినలేదు, నన్నే కూర్చోమంది. అంత ఫీవర్‌లో కూడా నేను కూర్చొని, తనని నాపై కూర్చోబెట్టుకున్నా. ఆ టైమ్‌లో కూడా తనకి టెంపరేచర్ ఉన్నా, తనన్న మాటకు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లాయి. - శైలజ మనోహర్ తిరుపతి ముఖచిత్ర లేఖనం: వాసు