బనగానపల్లె (కర్నూలు జిల్లా): అంతిమ యాత్ర లో టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు వెళ్లిపడి 20 గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మీరాపురం గ్రామంలో జరిగింది. దీంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.