![9 Lakh Rupees Burnt In Srikakulam District - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/24/sklm.jpg.webp?itok=b6uGeyhL)
సాక్షి, శ్రీకాకుళం: కొత్తూరు మండలం హంస కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతోపాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు)
కాలిపోయిన నగదు
Comments
Please login to add a commentAdd a comment