
సాక్షి, శ్రీకాకుళం(సంతకవిటి): మరో వారం రోజుల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం అలము కుంది. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సంతకవిటి–రాజాం ప్రధాన రహదారి గొల్లసీతారాంపురం మలుపు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంతకవిటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌వోగా పనిచేస్తున్న కె.సరోజిని (58) ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త ప్రదీప్ స్వల్పంగా గాయపడ్డారు.
ఎస్సై సీహెచ్ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం పట్టణం మారుతీనగర్‌లో ప్రదీప్ కుటుంబం ఉంటుంది. సరోజిని పీహెచ్‌సీలో పని చేస్తుండగా, ఆమె భర్త ప్రదీప్ హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమార్తెకు మరో వారం రోజుల్లో వివాహం.దీంతో కార్డులను పంచేందుకు ద్విచక్ర వాహనంపై బొద్దూరు, సంతకవిటి తదితర గ్రామాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. గొల్లసీతారాంపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరి వాహనం అదుపుతప్పి బోల్తా పడిపోయింది. చదవండి: (నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం)
దీంతో సరోజిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రదీప్ గాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆస్పత్రి తరలించారు. మృతురాలు సోదరుడు కె.శ్రీనివాసరావు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సోరోజినికి కొడుకు ఉండవల్లి చక్రవర్తి, కుమార్తె శ్రావణి ఉన్నారు. ఈమె ఏడాది క్రితం విజయనగరం నుంచి సంతకవిటి పీహెచ్‌సీకి బదిలీపై వచ్చారు
Comments
Please login to add a commentAdd a comment