జగ్గయ్యపేట: గుర్తుతెలియని దుండగులు ఏకంగా పోలీసుల వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుటు నిలిపి ఉంచిన పోలీసుల వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వాహనం పాక్షికంగా కాలిపోయింది.