అరటితోట దగ్ధం..రూ.5 లక్షలు ఆస్తినష్టం
Published Tue, Feb 28 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగిల్లులో దివాకర్‌రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి, పూర్తిగా కాలిపోయింది. బాధిత రైతు తహసీల్దార్ పీవీ రమణకు వినతిపత్రం అందజేశాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. పంటను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతుకు హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement