మెదక్: వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజు పెంపుదలను నిరసిస్తూ బుధవారం మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఏబీవీపీ నాయకులు తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక అతిథి గృహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఏంబీబీఎస్ సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడంవల్ల విద్యార్థులపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుందన్నారు. పెంచిన ఫీజును తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్, బాగ్ కన్వీనర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.