బుధవారం వీసీలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వాటిని ఏర్పాటు చేసిన కాలేజీలకే అనుబంధ గుర్తిం పునివ్వాలని చెప్పారు. 1,551 పోస్టుల్లో 1,061 పోస్టు ల భర్తీకి ఒకే చెప్పినా ఒక్క వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, వచ్చే జూన్ నాటికి అధ్యాపకుల నియామకాలను పూర్తి చేయాలన్నారు.
వర్సిటీల వైస్ చాన్సలర్ల (వీసీ)తో గతంలో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయించిన 10 అంశాల పురోగతిపై బుధవారం కడియం సమీక్షించారు. మౌలిక వసతుల కల్ప న పనులను మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించామని కడియం చెప్పారు. డిమాండ్ లేని విభాగాల్లో వచ్చిన పోస్టులను డిమాండ్ ఉన్న డిపార్ట్‌మెంట్లలోకి మార్పు చేసుకునే అధికారాన్ని వీసీలకు ఇచ్చామన్నారు. ఈ మార్పులతోపాటు రోస్టర్ తయా రు చేసుకొని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు.
ఐదేళ్లలో పీహెచ్‌డీ..
ఐదేళ్లలోగా పీహెచ్‌డీ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించాలని కడియం అన్నారు. అన్ని వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలపై ఆలోచన లేదని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళ వర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, 14 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
లోపం ఎవరిది?
‘నేను మంత్రి అయ్యాక వీసీలతో నిర్వహించిన ఐదో సమావేశం ఇది. తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేరకు అమలు కావట్లేదు. ప్రభుత్వపరంగా అర్థం చేసుకోవడంలో లోపం ఉందా.. మీ పనితీరులో లోపం ఉందా.. కౌన్సిల్ సరిగ్గా గైడ్ చేయలేకపోతోందా తెలియడం లేదు’ అంటూ వీసీల సమావేశంలో కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌తో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6 నెలల్లో అమలు చేస్తామన్నారు.
మళ్ళీ గవర్నర్ మీటింగ్ పెడితే ఏం సమాధానం చెబుతారు. కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచు తామని హామీ ఇచ్చాం. అదీ జరగడం లేదు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిద్దాం. పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమస్యలు ఎందుకు వస్తు న్నాయి. గైడ్లకు వివక్ష ఎందుకు? స్టూడెంట్ అకడ మిక్ ఫర్‌ఫార్మెన్స్ బాగా ఉన్నా గైడ్ మార్కులు ఇవ్వ డం లేదు. మనం గైడ్‌లైన్స్ ఫాలో కావడం లేదు. ఇది సరికాదు. అవకతవకలు, అనుమానాలకు అవకాశం లేకుండా పని చేయాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment