governer nara simhan
-
తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 12మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీ రామచంద్ర రావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావ్ 5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి 6. జస్టిస్ బులుసు శివ శంకర్ రావు 7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్ 8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు 9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్ 11. జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యన్ 12.ఆర్ ఎస్ చౌహన్ -
సమాజ సేవకుడికి గవర్నర్ ప్రశంస
జ్యోతినగర్(రామగుండం): సమాజసేవలో తనవంతు పాత్ర పోషించడంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నేనున్నాంటూ రక్తదానం చేయడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసిన సమాజసేవకుడు బుద్ధినేని సత్యనారాయణరావుకు గవర్నర్ నరసింహన్ ఉత్తమ రక్తదాత అవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ రక్తదాతగా జూలపల్లి మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బుద్ధినేని సత్యనారాయణరావును సత్కరించారు. ఈయన ఎన్పీడీసీఎల్లో విద్యుత్ సహాయ గణాంక అధికారిగా గోదావరిఖని, పెద్దపల్లి కార్యాలయాల్లో సేవలందించారు. ప్రస్తుతం మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. 45 సార్లు రక్తదానం చేయడంతోపాటు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3,425 యూనిట్ల రక్తాన్ని మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ వారికి అందించి తలసేమియా బాధితులకు ప్రాణదాతగా నిలిచారు. ఈసందర్భంగా అవార్డు అందుకున్న సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తమ రక్తదాతగా అవార్డు రావడం సంతోషంతో పాటు ఎంతో బాధ్యతను పెంచిందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ట్రస్టును నెలకొల్పి సమాజ సేవలో తరిస్తానని చెప్పారు. -
బయోమెట్రిక్ ఉంటేనే అనుబంధ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వాటిని ఏర్పాటు చేసిన కాలేజీలకే అనుబంధ గుర్తిం పునివ్వాలని చెప్పారు. 1,551 పోస్టుల్లో 1,061 పోస్టు ల భర్తీకి ఒకే చెప్పినా ఒక్క వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, వచ్చే జూన్ నాటికి అధ్యాపకుల నియామకాలను పూర్తి చేయాలన్నారు. వర్సిటీల వైస్ చాన్సలర్ల (వీసీ)తో గతంలో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయించిన 10 అంశాల పురోగతిపై బుధవారం కడియం సమీక్షించారు. మౌలిక వసతుల కల్ప న పనులను మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించామని కడియం చెప్పారు. డిమాండ్ లేని విభాగాల్లో వచ్చిన పోస్టులను డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్లలోకి మార్పు చేసుకునే అధికారాన్ని వీసీలకు ఇచ్చామన్నారు. ఈ మార్పులతోపాటు రోస్టర్ తయా రు చేసుకొని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఐదేళ్లలో పీహెచ్డీ.. ఐదేళ్లలోగా పీహెచ్డీ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించాలని కడియం అన్నారు. అన్ని వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలపై ఆలోచన లేదని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళ వర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, 14 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. లోపం ఎవరిది? ‘నేను మంత్రి అయ్యాక వీసీలతో నిర్వహించిన ఐదో సమావేశం ఇది. తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేరకు అమలు కావట్లేదు. ప్రభుత్వపరంగా అర్థం చేసుకోవడంలో లోపం ఉందా.. మీ పనితీరులో లోపం ఉందా.. కౌన్సిల్ సరిగ్గా గైడ్ చేయలేకపోతోందా తెలియడం లేదు’ అంటూ వీసీల సమావేశంలో కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌తో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. మళ్ళీ గవర్నర్ మీటింగ్ పెడితే ఏం సమాధానం చెబుతారు. కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచు తామని హామీ ఇచ్చాం. అదీ జరగడం లేదు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిద్దాం. పీహెచ్డీ అడ్మిషన్లలో సమస్యలు ఎందుకు వస్తు న్నాయి. గైడ్లకు వివక్ష ఎందుకు? స్టూడెంట్ అకడ మిక్ ఫర్ఫార్మెన్స్ బాగా ఉన్నా గైడ్ మార్కులు ఇవ్వ డం లేదు. మనం గైడ్‌లైన్స్ ఫాలో కావడం లేదు. ఇది సరికాదు. అవకతవకలు, అనుమానాలకు అవకాశం లేకుండా పని చేయాలి’ అని అన్నారు. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటారని గుర్తుచేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థించారు. సత్యమేవ జయతే మన జాతీయ నినాదమని, దసరా ఉత్సవాల నిర్వహణతో చెడుపై పోరాడేందుకు మన సంకల్పం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. -
‘రైట్ ఆఫ్ యూజ్’కు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం తెలంగాణ శాసన సభ చేసిన రైట్ ఆఫ్ యూజ్ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. ఈ మేరకు న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ చట్టాన్ని ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెలంగాణ గెజిట్‌లో ప్రచురించాలని గవర్నమెంట్ ప్రింటింగ్ విభాగం డెరైక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.