సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటారని గుర్తుచేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థించారు. సత్యమేవ జయతే మన జాతీయ నినాదమని, దసరా ఉత్సవాల నిర్వహణతో చెడుపై పోరాడేందుకు మన సంకల్పం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.