bio metric systems
-
నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలుత 30 శాతం ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. హాజరు శాతం అత్యంత తక్కువగా ఉన్న అన్ని కేటగిరీ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని శాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ దీన్ని అమలు చేస్తారు. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా పలుమార్లు హెచ్చరించారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రావడంలేదు. దీనికి సంబంధించి గురువారం ‘సాక్షి’లో ‘పల్లె నాడి పట్టని డాక్టర్’శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యుల గైర్హాజరుకు చెక్ పెట్టేందుకు దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. హాజరు తక్కువగా ఉన్న 30 శాతం ఆస్పత్రుల వివరాలను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాబితా ఆధారంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
ఆ ఎయిర్‌పోర్టుల్లో కెమెరాతోనే సెక్యూరిటీ క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇక ఎయిర్‌పోర్ట్‌ల్లో సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు భారీ ప్రక్రియకు తెరపడనుంది. విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్‌లు అవసరం లేకుండా కెమెరా వైపు చూడటం ద్వారా ముఖకవళికలను గుర్తించే ప్రక్రియను పలు విమానాశ్రయాలు త్వరలో చేపట్టనున్నాయి. ప్రయాణీకుల బోర్డింగ్ ప్రక్రియ కోసం విమనాశ్రయాలు ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నాయి. ప్రధాన మంత్రి డిజీ యాత్ర కార్యక్రమంలో భాగంగా పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఈ ఆధునిక వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కాగా వారణాసి, విజయవాడ, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల బోర్డింగ్ ప్రక్రియలో బయోమెట్రిక్ యాక్సెస్‌ను ప్రవేశపెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే.ముఖాలను గుర్తించే సాంకేతికతోయకూడిన ఆటోమేటెడ్ సెక్యూరిటీ స్కానర్లను ఎయిర్‌పోర్టుల ప్రవేశ, సెక్యూరిటీ, బోర్డింగ్ పాయింట్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల ముఖాలను కెమెరా స్కాన్ చేసి, ఆయా వివరాలను వెరిఫై చేస్తూ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుందని, క్లియరెన్స్ కోసం సెక్యూరిటీ గేట్ వద్ద ప్రయాణీకులు పడిగాపులు కాసే అవసరం ఉండదని పేర్కొన్నారు.మరోవైపు మూడు ఎయిర్‌పోర్టుల్లో పైటల్ పద్ధతిన బయోమెట్రిక బోర్డింగ్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. -
బయోమెట్రిక్ ఉంటేనే అనుబంధ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వాటిని ఏర్పాటు చేసిన కాలేజీలకే అనుబంధ గుర్తిం పునివ్వాలని చెప్పారు. 1,551 పోస్టుల్లో 1,061 పోస్టు ల భర్తీకి ఒకే చెప్పినా ఒక్క వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, వచ్చే జూన్ నాటికి అధ్యాపకుల నియామకాలను పూర్తి చేయాలన్నారు. వర్సిటీల వైస్ చాన్సలర్ల (వీసీ)తో గతంలో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయించిన 10 అంశాల పురోగతిపై బుధవారం కడియం సమీక్షించారు. మౌలిక వసతుల కల్ప న పనులను మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించామని కడియం చెప్పారు. డిమాండ్ లేని విభాగాల్లో వచ్చిన పోస్టులను డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్లలోకి మార్పు చేసుకునే అధికారాన్ని వీసీలకు ఇచ్చామన్నారు. ఈ మార్పులతోపాటు రోస్టర్ తయా రు చేసుకొని ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఐదేళ్లలో పీహెచ్డీ.. ఐదేళ్లలోగా పీహెచ్డీ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించాలని కడియం అన్నారు. అన్ని వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలపై ఆలోచన లేదని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళ వర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, 14 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. లోపం ఎవరిది? ‘నేను మంత్రి అయ్యాక వీసీలతో నిర్వహించిన ఐదో సమావేశం ఇది. తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేరకు అమలు కావట్లేదు. ప్రభుత్వపరంగా అర్థం చేసుకోవడంలో లోపం ఉందా.. మీ పనితీరులో లోపం ఉందా.. కౌన్సిల్ సరిగ్గా గైడ్ చేయలేకపోతోందా తెలియడం లేదు’ అంటూ వీసీల సమావేశంలో కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌తో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. మళ్ళీ గవర్నర్ మీటింగ్ పెడితే ఏం సమాధానం చెబుతారు. కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచు తామని హామీ ఇచ్చాం. అదీ జరగడం లేదు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిద్దాం. పీహెచ్డీ అడ్మిషన్లలో సమస్యలు ఎందుకు వస్తు న్నాయి. గైడ్లకు వివక్ష ఎందుకు? స్టూడెంట్ అకడ మిక్ ఫర్ఫార్మెన్స్ బాగా ఉన్నా గైడ్ మార్కులు ఇవ్వ డం లేదు. మనం గైడ్‌లైన్స్ ఫాలో కావడం లేదు. ఇది సరికాదు. అవకతవకలు, అనుమానాలకు అవకాశం లేకుండా పని చేయాలి’ అని అన్నారు. -
ప‘రేషాన్’!
మన్ననూర్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానంతో లబ్ధిదారులకు సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేష న్ షాపుల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీ సుకొచ్చింది. అయితే సిగ్నల్స్ అందక, లబ్ధిదారులు వేలిముద్రలు పడకపోవడంతో సరుకులు తీసుకెళ్లలేని పరిస్థితి నె లకొంది. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నా రు. ముఖ్యంగా బియ్యం రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. అయోమయంలో నిరక్షరాస్యులు కొంత మంది నిరక్షరాస్యులు సరుకుల విషయమై తెలిసిన వారిని అడిగితే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, తీరా మండల అధికారులు సిబ్బంది అందుకు సంబంధించి మాకెలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో డీలర్లు, సేల్స్మెన్లు రేషన్ కార్డు చూసి సరుకులు ఇచ్చేవారని కొత్తగా వచ్చిన పద్ధతితో సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 50శాతం సరుకుల పంపిణీ ఇప్పటివరకు లబ్ధిదారులకు 50శాతం సరుకులు పంపిణీ చేశారు. ఈనెల 26లోగా సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేలి ముద్రలు సరిపోవడం లేదు మిషన్‌లో వేలి ముద్ర సరిపోవడం లేదు. దాంతో బి య్యం, కిరోసిన్ ఇవ్వడం లేదు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. – చందాజీ, లబ్ధిదారుడు, మన్ననూర్ ఆందోళన అవసరం లేదు ఈ–పోస్ విధానంతో సమస్య ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇం దుకు సంబంధించి వీ ఆర్ఓకు అధికారం ఇ చ్చారు. వందలో ఒకరిద్దరికీ సొంత నిర్ణయంతో సరుకులు ఇప్పించే అధికారం ఉం ది. వచ్చేనెల నుంచి ఈ సమస్య రా కుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కృష్ణయ్య, తహసీల్దార్, అమ్రాబాద్ -
ఐటీడీఏ ప్రక్షాళనకు అధికారులు కసరత్తు !
► లోపాలను సరిదిద్దేందుకు యత్నం ► విధులకు డుమ్మాకొట్టే వారికి బయోమెట్రిక్‌తో చెక్ ► విద్య, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి ► ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు ! పార్వతీపురం: అవినీతి.. అవకతవకలు.. విధులకు డుమ్మా.. మితిమీరిన రాజకీయాలు... వంటి వాటితో ఎక్కడ వేసిన గొంగళి... అక్కడే అన్న చందంగా ఉన్న ఐటీడీఏను ప్రక్షాళన చేసేందుకు పీవో వి.ప్రసన్నవెంకటేష్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తూ... అధికారులు, సిబ్బందితో పనిచేయించేందుకు కొత్త పీవో ప్రసన్న వెంకటేష్ సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఐటీడీఏ కార్యాలయంతోపాటు పీహెచ్‌సీలు, వెలుగు, ఇంజినీరింగ్ తదితర శాఖల్లో విధులకు డుమ్మా కొడుతున్న అధికారులు, సిబ్బందిని దారిలోకి తెచ్చేందుకు బయోమెట్రిక్ హాజరుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అవినీతి మరకలంటుకున్న వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధి తదితర శాఖలను శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల పనితీరు తెలుసుకునేందుకు ‘గ్రామదర్శిని’ సబ్-ప్లాన్‌లోని పంచాయతీలు, గ్రామాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ‘గ్రామదర్శిని’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పీవో నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఉపాధి, వ్యవసాయం, ఉద్యానవన, వెలుగు, వాటర్ షెడ్, విద్య, వైద్య శాఖల్లో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది గురించి ఆరా తీస్తున్నారు. గిరిజనులు ప్రధానంగా ఎదుర్కొంటున్న విద్య, వైద్యం సమస్యలతోపాటు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించేం దుకు గ్రామ స్థాయిలో పర్యవేక్షణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అధికారులు చెప్పే మాటలకే పరిమితం కాకుండా, పీవో క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టనున్నారు.