![Minor Girl Deceased After Badly Burnt School Kitchen Tamil Nadu - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/17/1.jpg.webp?itok=WFi-2kSR)
ప్రతీకాత్మక చిత్రం
చైన్నై: ఇంటికి రావాల్సిన తమ చిన్నారి సమయం దాటుతున్న రాలేదు. తీరా వెతుకుతూ వెళ్లిన ఆ తల్లిదండ్రులకు సగం కాలిపోయిన తమ బిడ్డని చూసి తట్టుకోలేకపోయారు. కాపాడుకునే ప్రయత్నం చేసే లోపే వారి కంటి పాప కనుమూసింది. ఈ ఘోరం తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్న ఓ 5వ తరగతి బాలిక మధ్యాహ్నం విరామ సమయంలో తన ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. బాలిక కోసం వారు పాఠశాలకు వెళ్లి చూడగా పాఠశాల వంటగది సమీపంలో ఆమె తీవ్రంగా కాలిపోయి, కొన ఊపిరితో కనిపించింది.
బాలికను చికిత్స నిమిత్తం తక్షణమే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కూతురు తమ కళ్ల ముందే మృతి చెందడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబ సభ్యులుతో పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం పాప ఒంటిపై లైంగిక దాడికి సంబంధించిన గాయాలు లేవని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment