ప్రతీకాత్మక చిత్రం
కొరుక్కుపేట(చెన్నై): పుదుకోట్టై సమీపంలోని కీలయూర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఓ విద్యార్థిని ఇటీవల బాటిల్‌లోని నీరు తాగి వెంటనే వాంతులు చేసుకుంది. దీనికి కారణం ఏమిటని విచారించగా, ఆ విద్యార్థి తాగునీటి బాటిల్‌లో మూత్రం కలిపినట్లు తేలింది. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.
దీంతో జిల్లా ప్రధాన విద్యాశాఖాధికారి మంజుల, అధికారి పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పాఠశాలకు పిలిపించి ప్రశ్నించారు. దీంతో విద్యార్థిని తాగే వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపినట్లు ఇద్దరు విద్యార్థులు అంగీకరించారు. వెంటనే ఉపాధ్యాయులు ఇద్దరికీ పాఠశాల నుంచి బహిష్కరించారు. కాగా పుదుచ్చేరిలో సమీపంలోని వెంగ్కైవ్యాల్‌లో కొన్ని నెలల క్రితం ఓ పార్టీ వినియోగించే తాగునీటి ట్యాంక్‌లో మలం కలిపిన విషయం సంచలనం కలిగించింది. ఈ విషయం మరువక ముందే తాగినీటి బాటిల్‌లో మూత్రం కలిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చదవండి వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
Comments
Please login to add a commentAdd a comment