ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను వ్యతిరేకమని చెబుతు న్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీవీసీఎస్ (భారతీయ విద్యా ర్థి చైతన్య సంఘం) జిల్లా అధ్యక్షుడు రంజిత్ డిమాండ్ చేశారు. సీఎం వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడా రు. ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కేం ద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డా రు. తెలంగాణను అడ్డుకోవడం సిగ్గుచేట న్నారు. సీఎంతో సహ సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కమల్ కిషోర్,శేఖర్,రూకాత్, కిషన్, శ్రీధర్, శ్రీనివాస్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి
Published Thu, Dec 19 2013 6:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement