తప్పుల్లేకుండా తెలుగు మాట్లాడితే
లక్ష బహుమతి ఇస్తా
వరంగల్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదని, తెలంగాణపై రోజుకో అర్ధరహిత ప్రకటన చేస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. కిరణ్ తెలుగు భాషను ఖూనీ చేస్తున్నాడని, ఐదు నిమిషాలు వ్యాకరణ, భాషాదోషాలు లేకుండా తెలుగు మాట్లాడితే రూ.లక్ష బహుమతిని ఇస్తానని ప్రకటించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీటి, నక్సల్స్ సమస్య వస్తుందనడంలో అర్థం లేదన్నారు. ఇండియా, పాకిస్తాన్ ఐదు నదుల నీటిని, నైలు నదీజలాలను 11దేశాలు పంచుకుంటున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేసి అఖిలపక్షం ఏర్పాటు చేయూలని డివూండ్ చేసిన చంద్రబాబు అఖిలపక్షానికి వెళ్లకపోవడంతో ఆడ, వుగ కానీ పార్టీగా టీడీపీని ప్రజలు గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎంకు ఇంగితజ్ఞానం లేదు: కేటీఆర్
Published Mon, Dec 2 2013 2:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement