తాంసి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు శనివారం దహనం చేశారు. ముడుపులిచ్చి సీఎం పదవి తెచ్చుకున్న ఆయన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి సీమాంధ్రుల నుంచి ఎంత తీసుకున్నాడో చెప్పాలని టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ సామ నాగారెడ్డి డిమాండ్ చేశారు. నాయకులు శ్రీనివాస్, భగవాండ్లు, మహేందర్, అశోక్, కాంతారావు, బీజేపీ నాయకులు స్వామి, అడెల్లు పాల్గొన్నారు.
‘చంద్రబాబు చరిత్రహీనుడు..’
ఉట్నూర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై వ్యతిరేక వైఖరి బయటపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చరిత్రహీనుడుగా మిగిలిపోనున్నాడని జేఏసీ కన్వీనర్ మర్సకోల తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయడం, సీమాంధ్రలో అక్కడి మంత్రులు ప్రత్యేక రాష్ట్ర ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడాన్ని నిరసిస్తూ ఉట్నూర్‌లోని ఐబీ ప్రాంతంలో శనివారం చంద్రబాబు, సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మ దహనం చేశారు. పూటకో మాట మార్చుతున్న చంద్రబాబును నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని తిరుపతి పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖను వెనక్కి తీసుకుని ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు బానోత్ రామరావు, ధరణి రాజేశ్, కందుకూరి రమేశ్, లక్ష్మీపతి, శ్యామ్, రాథోడ్ జనార్దన్, సోఫియాన్, భీమ్‌రావు, మధు, సతీశ్, గోపాల్‌రావు, వసంత్ పాల్గొన్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
బోథ్ (ఇచ్చోడ) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ బోథ్ మండలం సోనాలలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు. నాయకులు చంద్రశేఖర్, మేస్రం భూమన్న, పోశేట్టి, సోంనాథ్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.