ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం జిల్లా: కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆరోపించింది. టేకులపల్లి మండలకేంద్రంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.