
వృద్ధుడి సజీవ దహనం
కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలంలో చెత్తను కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని ఓ వృద్ధుడు సజీ దహనమయ్యాడు. ఈ ఘటన మాల్యాల్ మండలం ముత్యంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన సంత ఆదిరెడ్డి(70) అనే వృద్ధుడు రోజువారి పనిలోభాగంగానే పోలానికి వెళ్లాడు.
తన పొలంలో చెత్త కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.