
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిని చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆదివారం స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కరెంటు సంక్షోభానికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, నాయకులు కరిపె శ్రీనివాస్, నయీం, కమ్మరి బీమన్న, రాచకొండ గోపి గోడాపురం సందీప్, సల్ల చంద్రహస్, గాడ్పు చందు, నిట్ట రవి, రాజేశ్వర్, గంగన్న, ముత్యం పాల్గొన్నారు.