మంటల్లో శునకం.. ప్రాణాలకు తెగించిన యువకుడు! | Man Enters Into A Burning House To Save His Dog, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: మంటల్లో శునకం.. ప్రాణాలకు తెగించిన యువకుడు!

Published Thu, Jan 25 2024 12:48 PM | Last Updated on Thu, Jan 25 2024 1:21 PM

Man Jumps Into Burning House to Save Dog - Sakshi

ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాటిని ఇంటిలోని మనుషుల్లానే భావిస్తూ, వాటిపై ప్రేమ కురిపిస్తుంటారు. వాటి రక్షణ కోసం ఏమి చేసేందుకైనా సిద్ధపడుతుంటారు. తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియో జంతు ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడాన్ని గమనించవచ్చు. ఈ నేపధ్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి , మంటలు వ్యాపించిన ఆ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అతనిని అగ్నిమాపక సిబ్బంది వారించినా, అతను వారి మాటను పట్టించుకోడు. 

మంటలు చుట్టుముట్టిన ఇంటిలోకి దూరిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తరువాత ఒక శునకాన్ని తీసుకుని బయటకు వస్తాడు.  ఆ శునకాన్ని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతికి స్వల్పంగా కాలిన గాయం అవుతుంది. ఈ కుర్రాడి జంతు ప్రేమను చూసిన వారంతా అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌)లో @HumansNoContext అనే ఖాతాలో షేర్‌ చేశారు. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్‌లో ‘తన పెంపుడు శునకాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు’ అని రాశారు. ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్‌ ఆ యువకుడని నిజమైన హీరో అంటూ మెచ్చుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement