చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్‌పూర్‌లో 74, భటిండాలో 70, ముక్త్‌సర్‌లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.
కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్‌లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
Comments
Please login to add a commentAdd a comment