పదెకరాల వేరుశెనగ పంట దహనం
Published Mon, Nov 30 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
మద్దికెర: కర్నూలు జిల్లాలో పదెకరాల వేరుశెనగ పంటను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. జిల్లాలోని మద్దికెర మండలం హంప గ్రామంలో సోమవారం వేకువజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో తలారిగా పనిచేసే రాముడు తన పదెకరాల్లో వేసిన వేరుశెనగ పంటను వాముగా వేశాడు. ఆ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పంట పూర్తిగా కాలి బూడిదయింది. దీంతో సుమారు రూ.1.50 లక్షల మేర రైతుకు నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు.
Advertisement
Advertisement