తెర్యాణి (ఆదిలాబాద్): ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారజామున 4 గంటలకు ఆదిలాబాద్ జిల్లా తెర్యాణి మండలం మొదలవాడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిత్రం దుర్గ ఇల్లు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా బెల్లంకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది (పైరింజన్) వచ్చే సరికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంతో సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. కాగా, దుర్గకు చుట్ట తాగే అలవాటు ఉందని స్థానికులు చెప్పారు. దీంతో ఆ ఇల్లు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందా ? లేక నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.