ఆటోనగర్ (విజయవాడ తూర్పు): సినిమాలో సీన్ చూస్తాడు.. నేర కథనాలను చూస్తాడు.. ఆ తర్వాత బయటకు వచ్చి అదే తరహాలో ఘటనలకు పాల్పడతాడు. సినిమాలో చూచిన విధంగానే చేస్తాడు. అంతే కాదు మద్యం సేవిస్తే మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో పోరంకి గ్రామం ప్రభునగర్‌కు చెందిన మొక్కపాటి ఫణిదుర్గాప్రసాద్ తెలియదు. వాహనాల దగ్ధం కేసులో నిందితుడు ఫణిదుర్గాప్రసాద్‌ను పెనమలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను తెలిపారు.
ఏసీపీ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ప్రభునగర్‌లో తన ఇంటికి వెళ్లేందుకు గాను మార్గమధ్యంలో పోరంకి గ్రామంలోని కరణం గారి బజారు వద్ద నిలబడ్డాడు. ఇక్కడే ఇళ్లముందు పార్కింగ్ చేసిన మూడు మోటార్ సైకిళ్లకు ఉన్న పెట్రోల్ ట్యాంకు పైపులను ఊడదీసి తన దగ్గర జేబులో ఉన్న లైటర్ తో వాటిని తగులపెట్టినట్టు ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు మంటలు అధికంగా వ్యాపించడంతో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఇన్నోవా కారు కూడా కాలిపోయిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడు గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా ఫణిదుర్గాప్రసాద్ విజయవాడలోని పోరంకి గ్రామం ప్రభునగర్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు.
(చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’)
కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment