Hong Kong skyscraper gutted in massive fire, video goes viral - Sakshi
Sakshi News home page

Video Viral: మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..

Published Fri, Mar 3 2023 9:16 AM | Last Updated on Fri, Mar 3 2023 12:20 PM

Hong Kong Skyscraper Consumes Fire Video Goes Viral - Sakshi

ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్‌లోని సిమ్‌ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున​ ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి.

ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్‌ గవర్నర్‌ డేవిడ్‌ ట్రెంచ్‌ చేత ప్రారంభించబడిన మెరైనర్స్‌​ అనే ఓ క్లబ్‌ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్‌ హోటల్‌ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా.

(చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement