
సాహసం సాహసం కోసమే చేసేవాళ్లు ఉన్నారు. పదిమందికి సహాయం కోసం సాహసం చేసేవాళ్లు ఉన్నారు. హాంకాంగ్‌కు చెందిన 35 సంవత్సరాల లై చి రెండో కోవకు చెందిన సాహసి. పదిసంవత్సరాల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల లై చి వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన వీల్‌చైర్‌నే విల్‌పవర్‌గా మార్చుకున్నాడు. ధైర్యసాహసాలకు ప్రతీక గా చెప్పుకునే 495 మీటర్ల లైన్‌రాక్ పర్వతాన్ని అయిదుసంవత్సరాల క్రితం వీల్‌చైర్‌తోనే అధిరోహించాడు.‘ఈ సాహస ప్రయాణంలో నేను దివ్యాంగుడిననే ఆలోచన ఎప్పుడూ రాదు’ అంటాడు లై చి.
రాక్ క్లైంబింగ్‌లో నాలుసార్లు ఏషియన్ ఛాంపియన్‌గా నిలిచిన లైచి తాజాగా మరో సాహస ఘట్టానికి తెర తీశాడు. 320 మీటర్ల పొడవైన నైనా టవర్స్‌ను వీల్‌చైర్‌తోనే అధిరోహించి ‘భళా!’ అనిపించుకున్నాడు. పర్వతాన్ని అధిరోహించడం కంటే అద్దాల ఆకాశహర్మ్యాన్ని అధిరోహించడమే చాలా కష్టమని చెబుతున్నాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ల కోసం నిధుల సమీకరణలో భాగంగా ఈ సాహసం చేశాడు లై చి.
Comments
Please login to add a commentAdd a comment