సాక్షి, తూర్పు గోదావరి: ఐ పోలవరం మండలం భైరవపాలెం వద్ద సముద్రంలో రిలయన్స్ రింగుకు సమీపంలో విచిత్రం చోటు చేసుకుంది. సముద్రంలో టోర్నడో ఏర్పడి నీరు సముద్రం నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్టు దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిని స్థానిక మత్స్యకారులు తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడే టోర్నడోలను ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని భైరవపాలెం మత్యకారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment