న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్‌కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్‌కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment