బోటెక్కిన డాల్ఫిన్! | Flippin heck: Incredible moment a dolphin shocks tourists by leaping out of the water and into their boat | Sakshi
Sakshi News home page

బోటెక్కిన డాల్ఫిన్!

Published Sat, Apr 30 2016 9:43 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

బోటెక్కిన డాల్ఫిన్! - Sakshi

బోటెక్కిన డాల్ఫిన్!

డాల్ఫిన్.. సముద్రంలో కనిపించే అందమైన జలచరం. ఎప్పుడూ సముద్రం మధ్యలో పడవలు, ఓడల వెంబడి కనిపించే తెల్లని నీళ్లలో మునిగి తేలడానికి ఇవి బాగా ఇష్టపడతాయని మనకు తెలిసిందే. వాటికున్న ఆ ఇష్టమే ఓ పడవలో ప్రయాణిస్తున్న వారికి షాక్ ఇచ్చింది.

మెక్సికోలో డాల్ఫిన్లను చూడటం కోసం పడవలో సముద్రంలోకి వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పడవ వెంబడి వస్తూ గాల్లో పల్టీలు కొడుతున్న ఓ డాల్ఫిన్ హఠాత్తుగా బోటు లోపలికి దూకేసింది. అంతే, పడవలోని వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో మొదట కాస్త కంగారు పడ్డ సిబ్బంది పరుగులు పెట్టారు.

కాస్త తేరుకున్నాక వారిలో ఇద్దరు బోటులో పడిన డాల్ఫిన్ మీద గుడ్డను కప్పి తిరిగి సముద్రంలో పడేశారు. బోటులో ప్రయాణిస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్ నెట్ లో  హల్ చల్ చేస్తుంది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement