Dolphin
-
డాల్ఫిన్లూ నవ్వుతాయి!
మనిషి తర్వాత అత్యంత తెలివైన జీవుల జాబితాలో డాల్ఫిన్లు అగ్ర స్థానంలో ఉంటాయన్నది తెలిసిందే. మన సైగలను ఇట్టే అర్థం చేసుకోవడంలో, తదనుగుణంగా స్పందించడంలో వాటికవే సాటి. అయితే, సహచరులతో కలిసి సరదాగా ఆడుకునేటప్పుడు అవి నోరంతా తెరిచి నవ్వుతాయి కూడానట! కొన్నేళ్లపాటు లోతుగా పరిశోధనలు చేసి మరీ సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పీసా పరిశోధకులతో కూడిన బృందం డాల్ఫిన్లు హావభావాలపై అధ్యయనం చేసింది. అవి బృందంగా ఏర్పడి ఆటలాడుకుంటున్న, శిక్షకులతో కలసి ఆడతున్న 80 గంటలకు పైగా ఫుటేజీని లోతుగా పరిశీలించింది. మనుషులతో ఆడేటప్పుడు మామూలుగానే ఉంటున్నా, తోటి నేస్తాలతో ఆడుకుంటున్నప్పుడు మాత్రం అవి తరచూ నోరంతా తెరిచి చక్కగా నవ్వుతున్నట్టు తేల్చారు. ఈ నవ్వుల్లో ఏకంగా 89 శాతం తన జట్టు సభ్యుడు దృష్టి పథంలోకి వచ్చినప్పుడే చోటుచేసుకుంటున్నాయట. ఆ వెంటనే సదరు సభ్యులు కూడా చిరునవ్వుతో ప్రతిస్పందిస్తున్నాయట. అంతేకాదు, అవతలి వారి ముఖకవళికలను అచ్చుగుద్దినట్టుగా అనుకరిస్తూ ఆటపట్టిస్తున్నాయట కూడా. డాల్ఫిన్లులో ఈ రెండు లక్షణాలను ఇంతకు ముందెప్పుడూ గుర్తించలేదని అధ్యయన బృంద సారథి ఎలిజబెటా పలాగీ వివరించారు. నవ్వు మనుషులకు మాత్రమే పరిమితమని ఇంతకాలంగా ఉన్న భావన తప్పని డాల్ఫిన్లు నిరూపించాయని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించారు. – రోమ్ -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? వాతావరణ మార్పులే కారణమా?
అమెరికాలోని అమెజాన్ నదిలో ఇటీవలి కాలంలో 120 డాల్ఫిన్ల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా డాల్ఫిన్లు చనిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ఉప నదుల్లోని వేలాది డాల్ఫిన్లు నీటిలో ఆక్సిజన్ లేకపోవడం కారణంగానూ చనిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ నదుల్లో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని చెరువులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ నదిలోని డాల్ఫిన్లు వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలకు విలవిలలాడిపోతున్నాయి. వేడి కారణంగా నదులు ఎండిపోతుండటంతో డాల్ఫిన్ల మనుగడకు ముప్పు ఏర్పడింది. తక్కువ నీటి మట్టాలు, అధిక ఉష్ణోగ్రతలు మొదలైనవి నదిలోని నీరు గణనీయంగా వేడెక్కడానికి కారణంగా నిలుస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న చేపలలో పింక్ డాల్ఫిన్లు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇవి దక్షిణ అమెరికాలోని నదులలో మాత్రమే కనిపిస్తుంటాయి. బ్రెజిల్ సైన్స్ మినిస్ట్రీతో కలిసి పనిచేస్తున్న మామిరోవా ఇన్స్టిట్యూట్ ఇటీవల లేక్ టెఫేలో లెక్కకుమించిన డాల్ఫిన్ మృతదేహాలు కనిపించాయని తెలిపింది. వీటి మృతి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని మామిరోవా ఇన్స్టిట్యూట్ తెలిపింది. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నదులలో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని మడుగులు, చెరువులకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ పని అంత సులభం కాదని, ఇలా చేస్తే వాటి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లి ఫోనులో మునక.. కుమారుడు నీట మునక! -
అత్యంత అరుదైన డాల్ఫిన్లు.. ఎక్కడో తెలుసా?
ఈ విషయాలు మీకు తెలుసా? డాల్ఫిన్లు సాధారణంగా శరీరంపై వైపున బూడిదరంగులోను, పొట్ట భాగంలో తెలుపు రంగులోను ఉంటాయి. అరుదుగా నలుపు తెలుపు మచ్చలతో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఫొటోలో కనిపిస్తున్న చారల డాల్ఫిన్లు అంత్యంత అరుదైనవి. ఇటీవల ఇవి ఇంగ్లండ్ తీరానికి ఆవల సముద్రంలో కనిపించాయి. ‘ఏకే వైల్డ్‌లైఫ్ క్రూజెస్’ పడవలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పడవ కెప్టెన్ కీత్ లీవ్స్ వీటిని గమనించాడు. సముద్రంలో ఈ చారల డాల్ఫిన్లు సయ్యాటలాడుతుండగా, తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. ఫాల్ముత్ తీరానికి ఆవల ఇవి కనిపించినట్లు కీత్ వెల్లడించాడు. వీటి ఫొటోలను అతడు ‘సీ వాచ్ ఫౌండేషన్’కు అందించాడు. వీటిని పరిశీలించిన ‘సీ వాచ్ ఫౌండేషన్’ నిపుణులు, ఇవి అంత్యంత అరుదైనవని తెలిపారు. -
మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్ నసీర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో రాజేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్! -
కృత్తివెన్ను తీరంలో డాల్ఫిన్ కళేబరాలు
సాక్షి, కృష్ణా కృత్తివెన్ను: కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని పెదగొల్లపాలెం బీచ్‌కి శుక్రవారం మూడు డాల్ఫిన్ కళేబరాలు కొట్టుకొచ్చాయి. సాధారణంగా మన సముద్ర జలాల్లో ఇవి చాలా అరుదుగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వీటిని సౌచాచైనెన్íÙస్ శాస్త్రీయనామం కలిగిన ఇండో ఫసిఫిక్ హంప్ బ్యాక్ డాల్ఫిన్లుగా పిలుస్తారు. ఇవి లోతైన ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడవు. తీరానికి దగ్గరగా ఉండటానికే మక్కువ చూపుతాయి. సాధారణ వేటగాడి వలకు కూడా చిక్కుతాయి. ప్రస్తుతం ఈ జాతి డాల్ఫిన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి ఇండియన్ సముద్ర జలాల్లో అరుదుగా కనిపిస్తాయి. మనుషులతో మమేకమయ్యే డాల్ఫిన్లు క్షీరద జాతికి చెందినవి. గతంలో కూడా ఈ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు వచ్చిన ఘటనలు ఉన్నాయి. -
బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
ఫన్నీ వీడియో: ఎగిరి తంతా.. పోరారేయ్ మచ్చా
-
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం చోటు చేసుకుంది. శరీరం మీద గాయాలతో ఒక డాల్ఫిన్ మృతదేహం విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్సకారులు దాని శరీరం మీద గాయాలు ఉన్నట్లు గమనించారు. డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో తిరిగే భారీ షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. మానవుడి తన విలాస జీవితం కోసం వాడే ప్లాస్టిక్ భూతం కారణంగా కూడా సముద్ర జీవులు మరణిస్తున్నాయి. మనం వాడి పారవేసే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇటీవల ఒక నివేదికలో తేలింది. చదవండి: ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది? -
కత్తులతో డాల్ఫిన్‌పై దాడి, ముగ్గురు అరెస్టు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు యువకులు ఒక డాల్ఫిన్‌ను కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవి అనే కనికరం లేకుండా డాల్ఫిన్ పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ కత్తులు, కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ జుగుప్సాకర సన్నివేశం డిసెంబర్ 31న యూపీలోని ప్రతాప్‌ఘర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని కొతారియా గ్రామం సమీపంలో ఉన్న శారద కెనాల్‌కు కొంతమంది యువకులు చేపల వేటకు వచ్చారు. వలలో పెద్ద చేప చిక్కిందన్న సంతోషంలో ఉన్న యువకులు అదే ధోరణిలో దానిపై దాడి చేశారు. ఇదే సమయంలో మరో గుంపు కూడా అక్కడికి చేరుకొని వారికి జత కలిశారు. అయితే వారికి దొరికింది ఒక డాల్ఫిన్ అన్న విషయాన్ని గుర్తించి కూడా దానిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కత్తులతో డాల్ఫిన్ శరీరాన్ని రెండు బాగాలు చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందారు. అనంతరం దానిని చంపి కెనాల్‌లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.(చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లడఖ్‌కు విదేశీ యువతుల క్యూ) దీనిని ఒక యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 9/51 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. On New Year's eve, a #dolphin was brutally murdered by people in Sharda canal of Uttar Pradesh's Pratapgarh area. These are rare dolphins of the Ganges who are on the verge of extinction. Shame 😡 #SaveThePlanet #Nature #Ganga #AnimalCruelty pic.twitter.com/w3zNQbEHu5 — Karan Bhardwaj (@BornOfWeb) January 8, 2021 -
జీతం అడిగితే.. గెంటేశారు!
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): ఇప్పటి వరకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించిన ఆ కంపెనీ ఇప్పుడు కార్మికుల తగ్గిం పు చర్యలు చేపడుతోంది. ఒమాన్ రాజధాని మస్కట్‌లో రేడియేటర్లు తయారు చేసే డాల్ఫిన్ కంపెనీ ఎంతో మంది విదేశీయులకు వీసాలు జారీచేసి ఉపాధి కల్పించింది. కార్మికులకు, ఉద్యోగులకు వారి పనినిబట్టి నెలకు 150 రియాళ్ల నుంచి 450 రియాళ్ల వరకు వేతనం చెల్లించడానికి అంగీకరించింది. దీంతో తెలం గాణ జిల్లాలకు చెందిన కొందరు టెక్నీషియన్లు రూ.60 వేల నుంచి రూ.70 వేలను వీసాల కోసం చెల్లించారు. ఒమాన్‌లో వాడీకబీర్, గాలా శాఖలలో పని కల్పించింది. మొదట్లో సక్రమంగా వేతనం.. కంపెనీలో పనికి కుదిరిన తరువాత ప్రతి నెలా సక్రమంగా వేతనం ఇచ్చిన యాజమాన్యం ఆ తరువాత మూడు, నాలుగు నెలకు ఒకసారి వేతనం ఇచ్చింది. దీనిపై ప్రశ్నించిన కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని పలువురు ఆరోపించారు. అలాగే కార్మికులకు ఉన్న వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూలీలు చేసే పనిని కూడా తమకు అప్పగిస్తున్నారని పలువురు తెలంగాణకు చెందిన కార్మికులు చెప్పారు. కంపెనీ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సరిగా పనిలేకపోవడం, వేతనం ఆశించిన విధంగా చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్తామని అంటే.. మొదటగా వీసాకు చెల్లించిన ఖర్చులన్నీ తిరిగి చెల్లించి వెళ్లిపోవాలని చెప్పారని వెల్లడించారు. వీసా ఒప్పందం ప్రకారం ఇంటికి వెళ్లే సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కంపెనీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో తాము ఆర్థిక భారం భరించామని కార్మికులు తెలిపారు. కంపెనీ నుంచి ఇంటికి వచ్చినందుకు డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యానికి రూ.60వేల వరకు జరిమానా చెల్లించడంతో పాటు విమాన చార్జీలు సొంతంగానే పెట్టుకున్నామన్నారు. ఇప్పటికి కొంత మంది కార్మికులు కంపెనీ యాజమాన్యం సరైన వసతి, భోజనం అందించక పోవడంతో కార్మికులు ఎంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. కాగా గడు వుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం కాగా గడువుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం రెండు సంవత్స రాల పాటు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉండదు. బలవంతంగా పంపించారు ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యం మమ్మల్ని బలవంతంగా గెంటేసింది. టెక్నికల్‌గా ఎంతో అనుభవం ఉన్న వారిని సాంకేతిక పనులపై వినియోగించుకోకుండా కార్మికులుగా ఉపయోగించుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్లిపోవాలన్నారు. అంతేకాకుండా మా నుంచి బలవంతంగా జరిమానా వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యంపై ఇండియన్ ఎంబసీలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. కంపెనీపై ఒమాన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మన విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకురావాలి. – మల్లూరి భూమన్న,పాలెం (నిజామాబాద్ జిల్లా) మాకు అన్యాయం చేశారు.. ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ మాకు అన్యాయం చేసింది. కంపెనీ తీరు సరిగా లేదు. కంపెనీపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జిల్లాల కార్మికులను వంచించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు చేరుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.– ద్యావల లింగన్న,కొత్తపేట్ (జగిత్యాల జిల్లా) -
షార్క్‌కన్నా షార్ప్!
పార్కుకెళితే... చిన్నచిన్న బోట్లు.. వాటిల్లో లాహిరి లాహిరి లాహిరి అంటూ షికార్లు మామూలే. కానీ ఫొటోలో కనిపిస్తున్న సీబ్రీచర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటారా? ఇది నీటిపైనే కాదు.. అడుగున కూడా దూసుకెళ్లగలదు. ఓ డాల్ఫిన్‌లా, ఓ తిమింగలంలా గాల్లోకి జంప్ చేయగలదు కూడా. అంతేనా...? చిన్నసైజు జలాంతర్గామిలా నీటిలోపల రయ్యి రయ్యి మని దూసుకెళ్లేటప్పుడు మీరు గిర్రున తిరగవచ్చు కూడా! యుద్ధవిమానం గాల్లో గిరికీలు కొట్టేలా అన్నమాట! అలాగనీ మరీ లోతులకు వెళ్లలేదు గానీ... దాదాపు 5 అడుగుల లోతుకు వెళ్లి పైకి రాగలదు. పైగా దీన్ని నడపడం చాలా సులువు కూడా. చేతులతో పట్టుకునే కంట్రోల్స్ ద్వారా దీన్ని నడుపుతారు. కంట్రోల్స్ రెండింటినీ ముందుకు తోస్తే రెక్కలు కూడా ముందుకు వంగిపోయి పడవ ముందుకు కదిలి నీటిలోపలికి వెళుతుంది. కంట్రోల్స్‌ను వెనక్కు లాగితే పడవ నీటి నుంచి పైకి లేస్తుంది. ఒకదాన్ని ముందుకు, రెండోదాన్ని వెనక్కు కదిపితే పడవ ఒకవైపునకు తిరుగుతుంది. అలాగే పట్టి ఉంచితే 360 డిగ్రీల కోణంలో గిర్రున తిరుగుతుందన్నమాట. సీబ్రీచర్ నీటిపై గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది. నీటిలోపలైతే ఈ వేగం 40 కిలోమీటర్లకు పడిపోతుంది. న్యూజీలాండ్‌కు చెందిన రామ్ ఇన్నిస్, అమెరికన్ డాన్ పియాజ్జాలు డిజైన్ చేసిన ఈ వినూత్న జలచర వాహనం వినోద కార్యకలాపాల కోసం ఇప్పటికే అందుబాటులో ఉంది. మూడు మోడళ్లలో అందుబాటులో ఉన్న ఈ సూపర్ వాటర్ క్రాఫ్ట్ ధర డిజైన్‌ను బట్టి రూ.56 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఉంటుంది. -
గువాహటి నగర జంతువుగా డాల్ఫిన్
గువాహటి: అస్సాం రాజధాని గువాహటికి మస్కట్‌గా గంగానది డాల్ఫిన్‌ను ఎంపిక చేశారు. ఒక పట్టణానికి ప్రత్యేకంగా జంతువును ప్రకటించడం ఇదే తొలిసారి. అంతరించడానికి చేరువగా ఉన్న డాల్ఫిన్‌తో పాటు బోర్ కాసో(నలుపు తాబేలు రకం), హార్గిలా( కొంగ రకం) మధ్య ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీ నిర్వహించి డాల్ఫిన్‌ను ఎంపికచేసినట్లు కామరూప్ మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఎం.అంగముత్తు తెలిపారు. -
బోటెక్కిన డాల్ఫిన్!
డాల్ఫిన్.. సముద్రంలో కనిపించే అందమైన జలచరం. ఎప్పుడూ సముద్రం మధ్యలో పడవలు, ఓడల వెంబడి కనిపించే తెల్లని నీళ్లలో మునిగి తేలడానికి ఇవి బాగా ఇష్టపడతాయని మనకు తెలిసిందే. వాటికున్న ఆ ఇష్టమే ఓ పడవలో ప్రయాణిస్తున్న వారికి షాక్ ఇచ్చింది. మెక్సికోలో డాల్ఫిన్లను చూడటం కోసం పడవలో సముద్రంలోకి వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పడవ వెంబడి వస్తూ గాల్లో పల్టీలు కొడుతున్న ఓ డాల్ఫిన్ హఠాత్తుగా బోటు లోపలికి దూకేసింది. అంతే, పడవలోని వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో మొదట కాస్త కంగారు పడ్డ సిబ్బంది పరుగులు పెట్టారు. కాస్త తేరుకున్నాక వారిలో ఇద్దరు బోటులో పడిన డాల్ఫిన్ మీద గుడ్డను కప్పి తిరిగి సముద్రంలో పడేశారు. బోటులో ప్రయాణిస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. -
సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్‌ను చంపేశారు..
బ్యూనస్ ఎయిర్స్: విభిన్న రీతుల్లో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి హిట్స్, లైక్స్ పొందడం ఓ వ్యసనంగా మారింది. ఇది ఎంతలా అంటే సెల్ఫీల మోజులో తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు.. ఇతర జీవుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అర్జెంటీనాలో సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడి ఓ డాల్ఫిన్‌ను చంపేశారు. సముద్రతీర పట్టణమైన సాంటా టెరిసిటాలో బీచ్‌లో సేదతీరుతున్న వారికి ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. అదీ అరుదైన జాతికి చెందిన లాప్లాటా డాల్ఫిన్. అంతే.. అక్కడున్న వారు దానిని నీటిలోకి వదలాలనే కనీస విషయాన్నే మరచిపోయి దానితో పోటీలు పడి సెల్ఫీలు దిగారు. ఒకరి చేతిలో నుండి ఇంకొకరు తీసుకుంటూ దానిని బయటే ఉంచారు. దీంతో ఆ డాల్ఫిన్ మృతి చెందింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన జంతుప్రేమికులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. లాప్లాటా డాల్ఫిన్లు ప్రపంచ వ్యాప్తంగా 30,000 మాత్రమే ఉన్నాయి. ఇవి అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్ తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన రకానికి చెందినవి. ఇప్పటికే వీటిని అంతరించి పోతున్న జీవుల జాబితాలో అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నట్లుగా రెడ్ లిస్ట్‌లో చేర్చారు. అర్జెంటీనా వైల్డ్‌లైఫ్ ఫౌడేషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డాల్ఫిన్లు కనిపిస్తే వాటిని వెంటనే నీటిలోకి వదలాలని ఓ ప్రకటనను విడుదల చేసింది. -
తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం
ఉలవపాడు : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలెం సముద్రతీరానికి సోమవారం ఒక తిమింగలం కొట్టుకొచ్చింది. ఆ తిమింగలం సుమారు 35 అడుగుల పొడవు ఉంది. అది చనిపోవడం వల్లే తీరానికి కొట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది. కాగా దీన్ని చూడటానికి చుట్టపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు. గ్రామస్తులు ఈ విషయం గురించి అధికారులకు సమాచారం అందించారు. -
మరోజలప్రళయం రాబోతోందా ?
-
డాల్ఫిన్స్....డ్యాన్సులు
-
డాల్ఫిన్ 007!
ఈ డాల్ఫిన్ ఓ రహస్య గూఢచారి. జేమ్స్‌బాండ్ టైపన్నమాట. ఇది మందుపాతరలను కనిపెడుతుంది.. బాంబులు పెట్టి.. శత్రు సైనికులను హతమారుస్తుంది.. తనకు ఎదురొస్తే.. తలకు తగిలించి ఉన్న కత్తులు లేదా తుపాకులతో వారిపై విరుచుకుపడుతుంది. అలా నోరెళ్లబెట్టకండి.. ఇవన్నీ చేసేది ఈ డాల్ఫిన్సే. 70లలోనేడాల్ఫిన్స్, సీల్స్లతో కూడిన రహస్య గూఢచారి దళం సోవియట్ యూనియన్‌కు ఉండేది. యూఎస్ఎస్ఆర్ పతనం తర్వాత అది ఉక్రెయిన్ సొంతమైంది. తాజాగా క్రిమియా రష్యాలో చేరడంతో క్రిమియాకు చెందిన ఈ గూఢచారి దళం ఇకపై రష్యా కోసం పనిచేయనున్నట్లు ఆ దేశ అధికారులు ఇటీవల ప్రకటించారు. -
నీటిలో చేపలా..
చేపలా సముద్రంలో ఈదులాడాలని ఉందా? డాల్ఫిన్‌లా ఇలా దూకాలని ఉందా? మీలాంటి వారి కోసమే ఈ మర చేప. చూడ్డానికి షార్క్‌లా కనిపిస్తున్నా వాస్తవానికిదో స్పీడ్ బోట్. పాత యుద్ధవిమానాల తాలూకు పరికరాలతో దీన్ని తయారుచేశారు. సీబ్రీచర్గా పిలుస్తున్న దీన్ని ఇన్నెస్పేస్ అనే సంస్థ తయారుచేసింది. 260 హార్స్పవర్ ఇంజిన్‌తో గంటకు 50 మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్ ధర రూ.41 లక్షలు. దీన్ని సీబ్రీచర్.కామ్ అనే ఆన్లైన్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
నీటిలోనూ ఎగరావచ్చు...!
-
నీటిలోనూ ఎగరావచ్చు...!
న్యూయార్క్: అంతుచిక్కని రహస్యాలను తన గర్భంలో దాచుకున్న సముద్రాన్ని జయించాలని ఉందా.... సాగరం లోతుల్లో డాల్ఫిన్లతో కలసి సాహసాలు చేయాలని ఉందా... అయితే త్వరలో మీ కోరిక నెరవేరబోతోంది. కాలిఫోర్నియాకు చెందిన హవేక్స్ ఓషియన్ టెక్నాలజీస్ సంస్థ సమద్రం అంతర్భాగంలో కూడా ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది. డీప్ ఫ్లైట్ సూపర్ ఫాల్కన్‌గా పిలిచే ఈ వాహనంలో ఒకేసారి ఇద్దరు ప్రయాణించవచ్చు. అచ్చంగా హెలికాప్టర్లా ఉండే ఈ వాహనం ఖరీదు రూ. 10.65 కోట్లు మాత్రమే.