విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం చోటు చేసుకుంది. శరీరం మీద గాయాలతో ఒక డాల్ఫిన్ మృతదేహం విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్సకారులు దాని శరీరం మీద గాయాలు ఉన్నట్లు గమనించారు. డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో తిరిగే భారీ షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. మానవుడి తన విలాస జీవితం కోసం వాడే ప్లాస్టిక్ భూతం కారణంగా కూడా సముద్ర జీవులు మరణిస్తున్నాయి. మనం వాడి పారవేసే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇటీవల ఒక నివేదికలో తేలింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment