yarada
-
కడలి కోత పెడుతోంది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరం మళ్లీ కోతకు గురవుతోంది. తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోంది. గతంలో 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కే బీచ్ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు. యారాడ నుంచి భీమిలి వరకూ.. సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడం వల్ల తీరంలో ఇసుక పెద్దమొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ ఇక్కడి తీరం కోత సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ఇందులో యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్ చేస్తుంది. దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది. తాజాగా దూకుడు తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది. దాదాపు వారం రోజులుగా ఈ పరిస్థితి ఉంది. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓ రిసార్ట్స్ సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. ఈ చెట్లు బీచ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. అలల ఉధృతి ఎక్కువైంది ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 11వ తేదీన పౌర్ణమి వచ్చింది. మరోవైపు ఉత్తరం వైపు నుంచి గాలుల ఉధృతి కూడా పెరిగింది. వీటి ప్రభావంతో అలల ఉధృతి సాధారణం కంటే అధికమైంది. సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ తాజాగా విశాఖ తీరం కోతకు కారణమవుతున్నాయి. – ప్రొఫెసర్ కేవీఎస్ఆర్ ప్రసాద్, వాతావరణం–సముద్ర అధ్యయన విభాగ పూర్వ అధిపతి, ఏయూ -
మైనర్‌తో ముందే పరిచయం.. మద్యం సేవించి బాలికపై అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: మండలంలోని యారాడ కొండపై ఓ బాలికపై యువకుడు బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి న్యూపోర్టు సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం... పెదగంట్యాడ మండలానికి చెందిన బాలిక (14) తొమ్మిదో తరగతి చదవుతోంది. ఆ బాలికకు అదే ప్రాంతానికి చెందిన మద్ది గణేష్‌రెడ్డి (19)తో పరిచయం ఏర్పడింది. పెదగంట్యాడలో బుధవారం జరిగిన ఓ పరస మహోత్సవానికి ఆ బాలిక తన అక్కతో కలిసి వెళ్లింది. కొద్దిసేపు పరసలో గడిపిన తర్వాత ఆ బాలిక అక్క అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఆ బాలిక తర్వాత గణేష్‌రెడ్డితో కలసి పరసలో గడిపింది. అక్కడి నుంచి యారాడ వెళ్దామని చెప్పి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గణేష్ తన మేనమామ గంగవరం గ్రామానికి చెందిన మైలపిల్లి రాజు అలియాస్ గిటార్ రాజు (26)కు ఫోన్ చేసి రప్పించాడు. అక్కడి నుంచి ముగ్గురూ యారాడ తీరానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తర్వాత ఆ ఇద్దరు యువకులు మద్యం సేవించారు. ఆ ఇద్దరిలో గణేష్ మద్యం మత్తులో నిద్రపోయాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న రాజు బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక కొండ పైనుంచి కిందకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని చెప్పడంతో న్యూపోర్టు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బాలిక త్రండి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ ఎస్.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం చోటు చేసుకుంది. శరీరం మీద గాయాలతో ఒక డాల్ఫిన్ మృతదేహం విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్సకారులు దాని శరీరం మీద గాయాలు ఉన్నట్లు గమనించారు. డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో తిరిగే భారీ షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. మానవుడి తన విలాస జీవితం కోసం వాడే ప్లాస్టిక్ భూతం కారణంగా కూడా సముద్ర జీవులు మరణిస్తున్నాయి. మనం వాడి పారవేసే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇటీవల ఒక నివేదికలో తేలింది. చదవండి: ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది? -
యారాడ బీచ్‌లో నేవీ ఉద్యోగుల గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ నేవీ షిప్ సుమిత్రలో పనిచేస్తున్న 30 మంది నావికా సిబ్బంది ఆదివారం యారాడ బీచ్ సందర్శనకు వెళ్లారు. వీరిలో జగత్ సింగ్, శుభమ్ అనే ఇద్దరు నౌకా సిబ్బంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరు గల్లంతయ్యారు. వెంటనే నావీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా జగత్ సింగ్ మృతదేహం లభించింది. శుభం ఆచూకీ ఇంకా లభించలేదు. అతనికోసం హెలికాప్టర్ ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!) -
ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: యారాడ సముద్ర తీరంలో రూ.2 కోట్ల వ్యయంతో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం యారాడ గ్రామంలో జీవీఎంసీ నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను మంత్రి అవంతి,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇనాం భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.యారాడని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. -
రాజేష్ కోసం ఆశగా నిరీక్షణ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ తీరంలో గల్లంతై నాలుగు రోజులు గడిచినప్పటికీ రాజేష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గడిచిన ఆదివారం విహారానికి యారాడ వచ్చిన 12 మంది యువకులలో ఆరుగురు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సోమవారం ఇద్దరు, మంగళవారం ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. మిగిలిన రాజేష్ ఆచూకీ కోసం న్యూ పోర్టు పోలీసులు బుధవారం ముమ్మరంగా గాలించారు. సాయంత్రం చీకటిపడేంత వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం మళ్లీ గాలింపు కొనసాగించనున్నారు. మరోవైపు నాలుగు రోజులు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాజేష్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని గంగమ్మ వైపు ఆశగా చూస్తున్నారు. నెల రోజుల కిందటే ప్రమాదంలో కాలు విరిగిపోతే శస్త్రచికిత్స చేయించామని, మోడ్రన్‌గా ఉండాలనుకునే కుమారుడు కనిపించకుండా పోయాడని విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ఇష్టపడే రాజేష్ కోసం ప్రస్తుతం ఆ కుటుంబమంతా తీరంలో ఆశగా నిరీక్షిస్తుండడం చూపరులను కలిచివేస్తోంది. మరోవైపు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్ కోసం కనీసం బోట్లుపై కూడా గాలించడం లేదని ఆరోపిస్తున్నారు. -
నిరీక్షణ నిష్ఫలం
యారాడ బీచ్‌లో మూడోరోజూ కన్నీటి కెరటాలు పోటెత్తాయి. గల్లంతైన ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే కుటుంబ సభ్యులు, బంధువుల ఆశలు కరిగిపోతున్నాయి. సోమవారం ఇద్దరి మృతదేహాలు లభించగా.. మంగళవారం మరో ముగ్గురు విగత జీవులుగానే లభించారు. మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నా.. ఆశలు మాత్రం ఆవిరవుతున్నాయి. మల్కాపురం(విశాఖ పశ్చిమ): సరదాగా యారాడ తీరంలో గడుపుదామని వెళ్లి రాకాసి అలలకు చిక్కిన వారిలో మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గంగవరం పోర్టు తీరంలో మంగళవారం ఉదయం ఒకరిది, సాయంత్రం మరొకరి మృతదేహం లభ్యమయ్యాయి. వీరిని దేవర వాసు(21), పేరిడి తిరపతి (21)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో రాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడి మృతదేహాన్ని న్యూపోర్టు పోలీసులు వెలికితీశారు. హెచ్‌బీ కాలనీ సమీప చాకలిపేట పరిధి భానునగర్‌కు చెందిన కోనా శ్రీనివాస్(21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇప్పటికే సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో నక్కా గణేష్(17), సోమిరెడ్డి దుర్గ(21) విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. మిగిలిన దౌలపల్లి రాజేష్(21)ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు, మెరైన్ సిబ్బంది, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. భీమిలి, ఆర్కే బీచ్, గంగవరం పోర్టు తీరం, అప్పికొండ తీరంలో గాలిస్తున్నారు. బుధవారం ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కోటి ఆశలతో ఎదురు చూపులు గల్లంతైన వారిలో ఇప్పటికి ఐదుగురి ఆచూకీ లభ్యం కావడంతో మిగిలిని రాజేష్ కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కడిని అయినా సురక్షితంగా ఒడ్డుకు చేర్చు తల్లీ అని యారా డ తీరంలో గంగమ్మను వేడుకుంటున్నారు. తిండి, నిద్ర మానుకుని యారాడ తీరంలో మూడు రోజుల నుంచి విలపిస్తుండడంతో వారి ని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. కంటికి రెప్పలా పెంచుకున్న కుమారులు ఇలా తమ ఆశలు ఆవిరి చేసి వెళ్లిపోయారంటూ మృతులు దేవర వాసు, తిరుపతి తల్లులు విలపిస్తున్నారు. తండ్రి మరణానంతరం ఆటో నడుపుతూ తల్లికి అండగా ఉన్న దేవర వాసు, తండ్రి చనిపోయాక తల్లి రెక్కల కష్టంతో ఐటీఐ చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్న పేరిడి తిరుపతి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంక మాకు దిక్కెవరు అంటూ ఆ తల్లులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): యారాడ బీచ్‌లో గల్లంతై మృతి చెందిన యువకుల కు టుంబాలను వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీ కృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ మా ర్చురీ వద్ద మంగళవారం ప రామర్శించారు. పోలీసు అధి కారులతో మాట్లాడుతూ పం చనామా త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతరం హెచ్‌బీ కాలనీకి చెందిన నక్క గణేష్, దుర్గ, దుర్గానగర్‌కు చెందిన వాసు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు పేద కుటుంబాలకు చెందినవారని, కుటుంబాలకు ఆసరాగా ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించడంతో నమ్ముకున్న వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం త్వరగా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కో రారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటా నని, అవసరమైన సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్ మొల్లి అప్పారావు, వైఎస్సార్ సీపీ 9వ వార్డు అధ్యక్షుడు అప్పారి గిరిబాబు పాల్గొన్నారు. -
శోక సంద్రం
క్షణాలు నిమిషాలయ్యాయి.. నిమిషాలు గంటలుగా మారాయి.. గంటలు కాస్త రోజుగా.. రోజున్నరగా.. ఇలా కాలం కరిగిపోతోంది. దాంతోపాటే వారి ఆశలు కరిగిపోతున్నాయి.. అయినా నిరీక్షణ మానలేదు.. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశతో తీరానికే అతుక్కుపోయారు. నిద్ర, తిండి ఇవేవీ పట్టడంలేదు.. కన్నీటి సుడులను ఆపుకొంటూ తీరంపై రెప్పలార్చకుండా కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు షిప్పులు, హెలికాప్టర్లు, గత ఈతగాళ్లు.. ఇలా అన్ని రకాలుగా సాగరాన్ని మధిస్తున్నా.. వారి అన్వేషణ పూర్తిగా ఫలించలేదు.ఆదివారం సాయంత్రం సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఇప్పటివరకు ఇద్దరి ఆచూకీ మాత్రమే లభించింది.అది కూడా సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో దుర్గా, గణేష్‌లు విగత జీవులుగానే లభించడంతో.. వారి కుటుంబాల అన్వేషణ, నిరీక్షణ విషాదాంతమైంది.మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నాయి.ఎక్కడో.. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశ.. ఆ ఆశతోనే తీరంలో రెండు రోజులుగా తిండీతిప్పలు మాని అలాగే ఉండిపోయారు. ఏ క్షణంలోనైనా గాలింపు బృందాలు శుభవార్త చెబుతాయేమనని ఆతృతగా గాలింపు చర్యలను గమనిస్తూ ఉండిపోయారు.వారి రోదనలు సాగర ఘోషను మించిపోయాయి.. తుపాను ప్రభావంతో సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా.. అంతకుమించి బాధిత కుటుంబాలు, స్నేహితుల కన్నీటి కెరటాలు పోటెత్తుతున్నాయి.ఆదివారం సాయంత్రం నుంచీ ఇక్కడే ఉండిపోయిన బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ యారాడ గ్రామస్తులు మానవత చాటుకుంటున్నారు. మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ సముద్రతీరానికి ఆదివారం విహారానికి వచ్చిన 12 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతవడంతో అంతటా విషాదం అలుముకుంది. సోమవారం సాయంత్రం వరకు వారి కోసం తీరంలో గాలించినా ఆచూకీ లభ్యం కావడంతో అందరిలో ఉత్కంఠ రేగింది. అయితే వారిలో హెచ్‌బీకాలనీ చాకలిపేటకు చెందిన దుర్గా(20),అదే ప్రాంతం భానునగర్ ప్రాంతానికి చెందిన నక్క గణేష్ (17)లు మృతి చెందారు. వారి మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం గంగవరం సముద్ర తీరం వద్దకు కొట్టుకువచ్చాయి. వీరిని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బోట్ల సాయంతో యారాడ తీరానికి తీసుకువచ్చి గల్లంతైన యువకుల బంధువులు, కుటుంబ సభ్యులకు చూపించారు. తొలుత వచ్చిన మృతదేహం దుర్గాదిగా, అనంతరం వచ్చిన మృతదేహాం గణేష్‌దిగా వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారి భౌతిక కాయాలను శవపంచనామా నిమిత్తం కేజీహెచ్‌కు న్యూపోర్టు పోలీసులు తరలించారు. ఆదివారం నుంచి తీరంలోనే కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి గల్లంతైన ఆరుగురి యువకుల తల్లిదండ్రులు,కుటుంబ సుభ్యలు,స్నేహితులు తిండి, నిద్ర మాని ఆశగా తీరం వైపు ఎదురుచూస్తూ అక్కడే ఉండి పోయారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోనేందుకు నేవీ,కోస్టుగార్డు,మెరైన్, న్యూపోర్టు పోలీసులు,గజ ఈత గాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి రెండు హెలికాఫ్టర్ల సాయంతో తీరం పై నుంచి బైనోక్లాక్,కెమెరాలు,జూమ్ కెమెరాల సాయంతో పరిశీలించారు. మూడు బోట్లు సాయంతో ఇతర సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు.బంధువులు,స్నేహితులు, కుటుంబ సభ్యులు తిండి,నిద్ర లేకుండా బాధతో తీరంలో ఉండడంతో యారాడ గ్రామ ప్రజలు చలించిపోయారు. వీరందరికీ భోజనాలు సమకూర్చారు. మిన్నంటిన రోదనలు గల్లంతైన వారి బంధువులు,కుటుంబ సభ్యుల రోదనలతో యారాడ సముద్ర తీరం శోకసంద్రంగా మారింది. ఎన్నో ఆశలతో పెంచుకున్న కన్న బిడ్డలు యవ్వనంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారని మృతులు గణేష్,దుర్గా తల్లిదండ్రులు రోదన అక్కడ వారిని కంటతడి పెట్టించింది. చేతికి అందివస్తారన్న తమ కుమారులు ఇంతలోనే వెళ్లిపోయారని.. తమకు ఇంకెవరు దిక్కు అంటూ మృతుల తల్లిదండ్రులు అక్కడ గంగమ్మవైపు ఆక్రోశంగా చూస్తూ రోదించారు. కంటికి రెప్పలా చూసుకున్న తమ బిడ్డలను పొట్టన పెట్టుకుని మా ఆశలు చిదిమేశావంటూ విలపించారు. మిత్రులను మరవలేకున్నాం ఎంతటి ఒత్తిడిలో ఉన్న నిత్యం మేమంతా ఒక్కసారైనా,లేదా ఫోన్లోనైనా కుసల ప్రశ్నలు వేసుకోనే వారిమి. ఇప్పుడు మా తో ఎవరు కబుర్లు చెబుతారు. మా బాధలు ఎవరు పంచుకుంటారు అంటూ మృతులు,గల్లంతైన యువకుల స్నేహితులు రోదించారు. రూ.200 అడిగితే రూ. 300 ఇచ్చా స్నేహితులతో సరదాగా విహారానికి వెళ్తున్నా రూ.200 ఇవ్వు అమ్మా అని ముద్దుగా అడిగితే రెండు వందలు ఏమి సరిపోతాయి.. రూ.300 తీసుకో నాన్నా అని ఇచ్చానని మృతుడు దుర్గా తల్లి గుర్తుచేసుకున్నారు. సాయంత్రం వచ్చినప్పుడు ఏమైనా తెస్తానని చెప్పి వెళ్లిన కొడుకు మాటను గర్తుచేస్తుకుంటూ విలపించింది. బిడ్డా నాకు ఏమీతీసుకురాకుండానే పరలోకానికి పో యావా అంటూ ఆ తల్లి రోదన చూసిన వారు తల్లడిల్లిపోయారు. మాకు నవ్వులు ఎవరు పంచుతారు నాయనా విధులు ముగించుకుని ఇంటికి వచ్చే గణేష్(మృతుడు)ఇంట్లో టీవీ చూçస్తూ ఆ కార్యక్రమాలను అనుకరిస్తూ మమ్మల్ని నవ్వించేవాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నవ్విస్తారంటూ గణేష్ కుటుం బ సభ్యులు రోదించారు. నవ్వులు పంచుతానని చెప్పి ఇలా ఏడిపిస్తావా అంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. -
కడలి మాటున కంటిదీపాలు
మద్దిలపాలెం( విశాఖ తూర్పు): వయసులో చిన్న వారైనా బాధ్యతలో చాలా పెద్దోలు. కన్నవారికి చేదోడువాదోడుగా ఉండాలనే తపన తప్ప చెడు వ్యసనాలతో జులాయిగా తిరిగే కుర్రాళ్లు కాదు. ఉదయం లేచింది మొదలు ఉపాది కోసం పాకుడాలాడే పిల్లలు. అలాంటి కుర్రాళ్లు కడలి మాటున కనుమరుగు కావడం దుర్గానగర్‌కాలనీ,రజకవీధి కాలనీ వాసులను విషాదంలోకి నెట్టింది. కాలనీవాసులంతా రెండురోజులుగా విషణ్ణ వదనంలో గడుపుతున్నారు. ఆదివారం నాగుల చవితి కావడంతో 12 మంది స్నేహితలు కలిసి పిక్నిక్ పేరుతో యారాడ బీచ్‌కు వెళ్లారు. ఇంటి వద్దే వంటకాలు చేసుకుని మరీ పయనం అయ్యారు. ఉదయం 11గంటలకు బయలు దేరి వెళ్లిన వారు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చేస్తామని ఇంట్లో వాళ్లకు చెప్పారు. అదే మూడు గంటల సమయంలో ఆరుగురు గల్లంతయ్యారనే పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. సోమవారం నాటి రజకవీధికి చెందిన దుర్గా, గణేష్‌లు మృతదేహాలు తీరానికి కొట్టుకు వచ్చాయి. వారి కుటుంబీకుల సమక్షంలో ఆ మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కాగా ఇంకా వాసు, శ్రీను, రాజేష్, తిరుపతి జాడ సోమవారం రాత్రికీ కానరాలేదు. దీంతో ఆ నలుగురి కుటుంబాలు మరింత దుంఖంలో మునిగిపోయాయి. వారి జాడ కోసం ఎదురుచూస్తున్నారు. పది నిమిషాల ముందు మాట్లాడాడు మూడు గంటలకు వచ్చేస్తామని సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు చెప్పాడు. పదినిమిషాల తర్వాత కెరటాల్లో కొట్టుకుపోయాడనే దుర్వార్త తోటి స్నేహితులు చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉదయాన్నే ఇంటి వద్దే వంటలు చేయించాడు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వచ్చేస్తామని చెప్పాడు. సరిగ్గా మూడుగంటలకు పదినిమిషాలు ముందు ఫోన్‌చేసి వచ్చేస్తున్నామన్నాడు. కెరటాలు మా కంటిదీపాలు ఆర్పేశాయమంటూ లక్ష్మి కన్నీంటి పర్యంతమయింది. పీఎంపాలెంలోని పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతూ పోషణ భారంగా ఉందని భావించి మధ్యలో చదువు మానేశాడు. నాకు తోడుగా ఉండేందుకు ఆటో నడుపుతూ నన్నుపోషిస్తున్నాడు. ఇప్పడు నాకు దిక్కు ఎవరు అంటూ గుండెలు పగిలేలా రోధించింది. బాధితులకు వంశీకృష్ణ పరామర్శ యారాడ తీరంలో గల్లంతైన యువకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తీరంలో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుటుంబాలను ఆదుకోవాలన్నారు. -
పండగ పూట పెను విషాదం
-
విశాఖపట్నం యారడా బీచ్‌లో విషాదం
-
హతవిధీ.!
విశాఖపట్నం, గాజువాక/మద్దిలపాలెం: పండగ పూట సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుల కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. తమ కళ్లముందే స్నేహితులు సముద్రంలో గల్లంతు కావడంతో మిగతా వారిని దుఃఖసాగరం కమ్మేసింది. యారాడ బీచ్‌కు వచ్చిన యువకుల్లో ఆరుగురు ఆచూకీ కనుమరుగు కావడంతో నగరం ఉలిక్కి పడింది. బీచ్‌లో గల్లంతైనవారంతా 22 ఏళ్ల లోపువారే. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఉపాధి బాట పట్టారు. చదివిన ఐటీఐ కోర్సునే ఆధారంగా ఎలక్ట్రీషియన్లుగా కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు. నగరంలోని హెచ్‌బీ కాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది స్నేహితులు నాగులచవితి కావడంతో పిక్నిక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో యారాడ బీచ్‌కు ఆటోలో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు సముద్ర పరిసరాల్లో సరదాగా గడిపి మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. ఆ తరువాత 2.30 గంటల సమయంలో సముద్ర స్నానానికి దిగిన కొద్ది సేపటికే వచ్చిన భారీ అల ఆరుగురిని సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. ఇద్దరు సముద్రం ఒడ్డునే ఉండిపోగా, మిగిలిన పది మంది సముద్రంలోకి దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముగ్గురు ఒక చోట, మిగిలిన ఏడుగురు ఒకచోట స్నానం చేస్తుండగా సముద్ర అల ఆ ఏడుగురినీ లాక్కెళ్లిపోయింది. వారిలో బాలు అనే వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఓ లైఫ్ గార్డ్ అతడిని రక్షించగలిగాడు. మిగిలిన వారిలో హెచ్‌బీ కాలనీ దుర్గానగర్‌కు చెందిన దేవర వాసు (21), పేరిడి తిరుపతి (21), చాకలిపేట భానునగర్‌కు చెందిన కోన శ్రీనివాస్ (21), నక్క గణేష్ (17), దుర్గ్గ (21), కేఆర్ఎం కాలనీకి చెందిన రాజేష్ (21) గల్లంతైనట్టు ప్రమాదం నుంచి బయటపడ్డ బాలు తెలిపాడు. దేవర వాసు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేరిడి తిరుపతి సాంకేతిక కళాశాలలో ఐటీఐ విద్యనభ్యసిస్తున్నాడు. కోన శ్రీనివాస్, నక్కా గణేష్, దుర్గా ఒక ప్రైవేట్ ఎలక్ట్రికల్ షాప్‌లో, రాజేష్ ఫొటో స్టూడియోలో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయానికి వరకు గల్లంతైనవారి ఆచూకీ తెలియరాలేదు. వారికోసం పోలీసులు, యారాడకు చెందిన గజ ఈతగాళ్లు విరామం లేకుండా గాలిస్తున్నారు. నేవీ దళం కూడా రంగంలోకి దిగింది. సమాచారం అందుకున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంఘటనస్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆయన అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా ఇక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. మల్కాపురం సీఐ కేశవరావు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు వంశీకృష్ణ పరామర్శ వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, ఆ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ అప్పారావు, కన్నారావులు బాధిత కుటుం బాలను కలసి పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంటి పాపల కోసం ఎదురుచూపులు యువకులు గల్లంతవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. పండగ పూట వారి ఇళ్లు రోదనలతో మిన్నంటాయి. గల్లంతైన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. వయసులో చిన్నవాళ్లయినప్పటికీ.. కుటుంబ పోషకులుగా ఉన్నారు. తమ బిడ్డలు తిరిగి వస్తారనే ఆశతో వారంతా ఎదురుచూస్తున్నారు. ఒంటరైన తల్లి తండ్రి చనిపోవడంతో ఆటో నడుపుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు దేవర వాసు. అతను గల్లంతయ్యాడన్న వార్త ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి బోరున విలపించారు. వీరిది విజయనగరం. వాసు తండ్రి చనిపోవడం, అక్కకు వివాహ కావడంతో.. వీరు నగరానికి వలస వచ్చారు. 9వ వార్డులోని దుర్గానగర్ కొండ ప్రాంతంలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. .అన్నయ్య తిరిగి వస్తాడు తల్లిదండ్రులు దినసరి కూలీలు. వారి ఒక్కగానొక్క కొడుకు సోమిరెడ్డి దుర్గ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంతలో స్నేహితులతో కలసి కొడుకు సముద్రంలో కొట్టుకుపోయడాని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అన్నయ్య తిరిగి వస్తాడంటూ తల్లిదండ్రులను అతని చెల్లి ఓదార్చి న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. వృద్ధుల వేదన వర్ణనాతీతం విజయనగరం జిల్లా జమ్మయ్యపేటకు చెందిన నక్కా గణేష్ తల్లి రెండేళ్ల కిందట చనిపోయారు. దీంతో రజకవీధిలో ఉంటున్న అమ్మమ్మ, తాతయ్య వద్దకు గణేష్ వచ్చేశాడు. ఇక్కడే ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటున్నాడు. తండ్రి రమణ సొంత ఊరిలో కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గణేష్ గల్లంతయ్యాడన్న వార్తతో ఆ వృద్ధులు బోరున విలపిస్తున్నారు. శోకసంద్రంలో తల్లిదండ్రులు విజయనగరం జిల్లా నిమ్మవలసకు చెందిన కోనా ఆదినారాయణ, రామలక్ష్మీల ఆఖరి సంతానం కోనా శ్రీనివాస్. స్నేహితులతో కలసి పిక్నిక్ వెళ్లి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్‌కు అక్క, అన్నయ్య ఉన్నారు. ముద్దుల కొడుకు వస్తాడని.. దౌలపల్లి రాజేష్ దివ్యాంగుడు. ఫొటోషాప్ నేర్చుకుని రామా టాకీస్ వద్ద సాయి రోహిణిలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్లిన కొడుకు గల్లంతయ్యాడనే సమాచారంతో ఆ ఇంట విషాదం నెలకొంది. తండ్రి నారాయణరావు షిప్పింగ్ హార్బర్లో కూలీగా పనిచేస్తున్నాడు. పుట్టలో పాలు పోసి సందడిగా గడిపాడు తన కుమారుడి తిరుపతి భవిష్యత్ కోసం ఆ తల్లి కలలు కన్నారు. ఇప్పుడు అతను గల్లంతయ్యాడన్న వార్త ఆమెలో విషాదం నింపింది. ఉదయమే అమ్మ, చెల్లితో కలిసి పుట్టలో పాలు సందడి చేశాడు. అనంతరం స్నేహితులతో కలసి యారాడ వెళ్లాడు. ఇప్పుడు గల్లంతయ్యాడన్న వార్తతో తల్లి కుమారి, చెల్లి స్వప్నలిద్దరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి చనిపోయిన తరువాత తల్లి కుమారి కూలి పని చేసుకుంటూ కుమారుడిని పి.ఎం.పాలెంలోని సాంకేతిక కళాశాలలో ఐటీఐ చదివించారు. తిరుపతి చదువుకుంటూనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. వీరు విజయనగరం నుంచి ఇక్కడకు వలస వచ్చి.. దుర్గానగర్ కొండపై అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. -
విశాఖ తీరంలో ఆరుగురు గల్లంతు
గాజువాక/మల్కాపురం: విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో స్నానానికి దిగిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. న్యూపోర్టు పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరంలోని సీతమ్మధార దరి హెచ్‌బీ కాలనీ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులు ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో యారాడ బీచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం భోజనం ముగించుకొన్న అనంతరం 2.30 గంటల సమయంలో వారిలో పది మంది సముద్రంలో స్నానానికి దిగారు. అయితే ఆ సమయంలో వచ్చిన ఓ రాకాసి అల ఏడుగురిని లోపలికి లాక్కెళ్తుండగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఓ యువకుడిని బయటకు లాగి రక్షించాడు. మిగిలిన వారిలో హెచ్‌బీ కాలనీ దర్గానగర్‌కు చెందిన దేవర వాసు (21), పేరిడి తిరుపతి (21), చాకలిపేట భానునగర్‌కు చెందిన కోన శ్రీనివాస్ (21), నక్క గణేష్ (17), దుర్గా (21), కేఆర్ఎం కాలనీకి చెందిన రాజేష్ (21) గల్లంతైనట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ నుంచి కోస్టుగార్డు సహాయాన్ని కూడా కోరినట్టు న్యూపోర్టు సీఐ సోమశేఖర్ తెలిపారు. మల్కాపురం సీఐ కేశవరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. గల్లంతైనవారిలో దేవర వాసు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేరిడి తిరుపతి ఐటీఐ చదువుతున్నాడు. కోన శ్రీనివాస్, నక్కా గణేష్, దుర్గా ఒక ప్రైవేట్ ఎలక్ట్రికల్ షాప్‌లో, రాజేష్ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గల్లంతైనవారి ఆచూకీ అర్ధరాత్రి సమయానికి కూడా తెలియరాలేదు. వారికోసం పోలీసులు, యారాడకు చెందిన గజ ఈతగాళ్లు విరామం లేకుండా గాలిస్తున్నారు. నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆయన అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. అలల తాకిడే ప్రమాదానికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలలు ఉవ్వెత్తున వస్తాయని, ఆ సమయంలో ఎవరైనా స్నానాలకు వెళ్తే ప్రమాదాలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. యారాడ సముద్ర తీరానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గత మూడేళ్లలో ఇక్కడ సుమారు 30 మంది మృతిచెందారు. -
యారాడలో షూటింగ్ సందడి
మల్కాపురం : ఎస్.వీ.ఎస్ క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ నంబర్–1 చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆదివారం యారాడ బీచ్‌లో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి,దర్శుకురాలు విజయనిర్మల మనవడు,హీరో నరేష్ తనయుడు నవీన్ హీరోగాlనటిస్తున్నాడు. నటి శ్రావ్య, నవీన్ మధ్య ప్రేమ సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో నవీన్ తనకు ఇది రెండో చిత్రమని,తొలి సినిమా విడుదల కావల్సి ఉందన్నారు. తన తండ్రిలా చిత్రరంగంలో మంచి పేరుతెచ్చుకొంటానన్నారు. యారాడ బీచ్ ఎంతో సుందరంగా ఉందన్నారు. -
యారాడలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నంలోని యారాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 140 మద్యం బాటిళ్ల కేసులను బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి సన్యాసిరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు అందించిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.