పండగ పూట సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుల కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. తమ కళ్లముందే స్నేహితులు సముద్రంలో గల్లంతు కావడంతో మిగతా వారిని దుఃఖసాగరం కమ్మేసింది. యారాడ బీచ్‌కు వచ్చిన యువకుల్లో ఆరుగురు ఆచూకీ కనుమరుగు కావడంతో నగరం ఉలిక్కి పడింది. బీచ్‌లో గల్లంతైనవారంతా 22 ఏళ్ల లోపువారే. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఉపాధి బాట పట్టారు. చదివిన ఐటీఐ కోర్సునే ఆధారంగా ఎలక్ట్రీషియన్లుగా కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు.