ఈ విషయాలు మీకు తెలుసా?
డాల్ఫిన్లు సాధారణంగా శరీరంపై వైపున బూడిదరంగులోను, పొట్ట భాగంలో తెలుపు రంగులోను ఉంటాయి. అరుదుగా నలుపు తెలుపు మచ్చలతో కూడా ఇవి కనిపిస్తుంటాయి. ఫొటోలో కనిపిస్తున్న చారల డాల్ఫిన్లు అంత్యంత అరుదైనవి. ఇటీవల ఇవి ఇంగ్లండ్ తీరానికి ఆవల సముద్రంలో కనిపించాయి. ‘ఏకే వైల్డ్‌లైఫ్ క్రూజెస్’ పడవలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పడవ కెప్టెన్ కీత్ లీవ్స్ వీటిని గమనించాడు.
సముద్రంలో ఈ చారల డాల్ఫిన్లు సయ్యాటలాడుతుండగా, తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. ఫాల్ముత్ తీరానికి ఆవల ఇవి కనిపించినట్లు కీత్ వెల్లడించాడు. వీటి ఫొటోలను అతడు ‘సీ వాచ్ ఫౌండేషన్’కు అందించాడు. వీటిని పరిశీలించిన ‘సీ వాచ్ ఫౌండేషన్’ నిపుణులు, ఇవి అంత్యంత అరుదైనవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment