కృత్తివెన్ను మండలం పెదగొల్లపాలెం బీచ్‌లో డాల్ఫిన్ కళేబరం
సాక్షి, కృష్ణా కృత్తివెన్ను: కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని పెదగొల్లపాలెం బీచ్‌కి శుక్రవారం మూడు డాల్ఫిన్ కళేబరాలు కొట్టుకొచ్చాయి. సాధారణంగా మన సముద్ర జలాల్లో ఇవి చాలా అరుదుగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వీటిని సౌచాచైనెన్íÙస్ శాస్త్రీయనామం కలిగిన ఇండో ఫసిఫిక్ హంప్ బ్యాక్ డాల్ఫిన్‌లుగా పిలుస్తారు. ఇవి లోతైన ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడవు. తీరానికి దగ్గరగా ఉండటానికే మక్కువ చూపుతాయి.
సాధారణ వేటగాడి వలకు కూడా చిక్కుతాయి. ప్రస్తుతం ఈ జాతి డాల్ఫిన్‌లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి ఇండియన్ సముద్ర జలాల్లో అరుదుగా కనిపిస్తాయి. మనుషులతో మమేకమయ్యే డాల్ఫిన్‌లు క్షీరద జాతికి చెందినవి. గతంలో కూడా ఈ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో డాల్ఫిన్‌లు వచ్చిన ఘటనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment