
తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం
ఉలవపాడు : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలెం సముద్రతీరానికి సోమవారం ఒక తిమింగలం కొట్టుకొచ్చింది. ఆ తిమింగలం సుమారు 35 అడుగుల పొడవు ఉంది.
అది చనిపోవడం వల్లే తీరానికి కొట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది. కాగా దీన్ని చూడటానికి చుట్టపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు. గ్రామస్తులు ఈ విషయం గురించి అధికారులకు సమాచారం అందించారు.