( ఫైల్ ఫోటో )
అమెరికాలోని అమెజాన్ నదిలో ఇటీవలి కాలంలో 120 డాల్ఫిన్‌ల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా డాల్ఫిన్లు చనిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ఉప నదుల్లోని వేలాది డాల్ఫిన్లు నీటిలో ఆక్సిజన్ లేకపోవడం కారణంగానూ చనిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ నదుల్లో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని చెరువులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమెజాన్ నదిలోని డాల్ఫిన్లు వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలకు విలవిలలాడిపోతున్నాయి. వేడి కారణంగా నదులు ఎండిపోతుండటంతో డాల్ఫిన్ల మనుగడకు ముప్పు ఏర్పడింది. తక్కువ నీటి మట్టాలు, అధిక ఉష్ణోగ్రతలు మొదలైనవి నదిలోని నీరు గణనీయంగా వేడెక్కడానికి కారణంగా నిలుస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రాణాలు కోల్పోతున్న చేపలలో పింక్ డాల్ఫిన్లు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇవి దక్షిణ అమెరికాలోని నదులలో మాత్రమే కనిపిస్తుంటాయి. బ్రెజిల్ సైన్స్ మినిస్ట్రీతో కలిసి పనిచేస్తున్న మామిరోవా ఇన్‌స్టిట్యూట్ ఇటీవల లేక్ టెఫేలో లెక్కకుమించిన డాల్ఫిన్ మృతదేహాలు కనిపించాయని తెలిపింది. వీటి మృతి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని మామిరోవా ఇన్స్టిట్యూట్ తెలిపింది. సీఎన్‌ఎన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నదులలో మిగిలి ఉన్న డాల్ఫిన్లను శివార్లలోని మడుగులు, చెరువులకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ పని అంత సులభం కాదని, ఇలా చేస్తే వాటి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తల్లి ఫోనులో మునక.. కుమారుడు నీట మునక!
Comments
Please login to add a commentAdd a comment